ఎన్టీఆర్ కథానాయకుడు - మహానాయకుడు సినిమాలు రిలీజ్ అయ్యే వరకు హడావుడి ఏ మాత్రం తగ్గేలా లేదు. ఈ ప్రతిష్టాత్మక బయోపిక్ ఎన్ని రికార్డులు సృష్టిస్తుందో గాని ప్రమోషన్స్ తో హడావుడి చేస్తూనే కాస్త తడబడుతోంది. ప్రీ రిలీజ్ ట్రైలర్ లాంచ్ అంటూ ఈవెంట్స్ ప్లానింగ్ రెడీ అవుతున్నా సమయం దగ్గరికి వచ్చేసరికి అంతా రివర్స్ అవుతోంది. 

రీసెంట్ గా ట్రైలర్ ను హైదరాబాద్ లో అలాగే ఆడియో ఈవెంట్ ను నిమ్మకూరులో గ్రాండ్ గా నిర్వహించనున్నట్లు చిత్ర యూనిట్ కొన్ని పోస్టర్స్ ని రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు మరో పోస్టర్ తో ట్రైలర్ అండ్ ఆడియో ఈవేట్స్ లను ఒకేసారి డిసెంబర్ 21న జరుపనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. వేదిక ఎక్కడ అనేది ఇంకా నిర్ధారణ కాలేదు. 

పోస్టర్ లో బాలయ్య ఎన్టీఆర్ గెటప్ లో సింపుల్ గా కనిపిస్తూనే ఓ ప్రపంచాన్ని గుర్తుచేస్తున్నారు. ఆ నాటి కెమెరా వెనుక సీనియర్ ఎన్టీఆర్ ఉండే వరల్డ్ ను క్రిష్ ప్రతి హృదయానికి దగ్గరయ్యేలా చూపిస్తున్నట్లు అర్ధమవుతోంది. ఇక ఎమ్ఎమ్.కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాను బాలకృష్ణ - సాయి కొర్రపాటి అలాగే విష్ణు ఇందూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.