Asianet News TeluguAsianet News Telugu

ఈ మాత్రం దానికే... నందమూరి అభిమానులకు బడాయి ఎక్కువైందే!

బింబిసార విజయంతో నందమూరి ఫ్యాన్స్ ఎక్కువ చేస్తున్నారు. ఎన్టీఆర్, బాలయ్య, కళ్యాణ్ రామ్ టాలీవుడ్ ని కాపాడిన హీరోలుగా అభివర్ణిస్తున్నారు. అదే సమయంలో మెగా హీరోలను ఎగతాళి చేస్తున్నారు. ఇదంతా గమనిస్తున్న నెటిజెన్స్ అతి అంటూ సెటైర్స్ వేస్తున్నారు.

ntr balakrishna fans over action after bimbisara hit
Author
Hyderabad, First Published Aug 8, 2022, 3:05 PM IST

అరుదుగా నందమూరి హీరోలకు విజయాలు దక్కుతాయి. బాలకృష్ణ(Balakrishna), ఎన్టీఆర్ వంటి టాప్ స్టార్స్ కూడా ఒక్క హిట్ ఇస్తే వరుసగా రెండు మూడు ప్లాప్స్ ఇస్తారు. టెంపర్ మూవీ వరకు హిట్స్ లేక అల్లాడిన ఎన్టీఆర్ కొంచెం దారిన పడ్డాడు. నందమూరి ఫ్యామిలీ నుండి ఎన్టీఆర్ మాత్రమే వరుస హిట్స్ ఇస్తున్నాడు. గతంలో అయితే ఎన్టీఆర్(NTR) ది కూడా బాలకృష్ణ పరిస్థితే. ఇక కళ్యాణ్ రామ్ హిట్స్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఎన్టీఆర్ కి స్వయానా అన్నైన కళ్యాణ్ రామ్ ఇండస్ట్రీకి వచ్చి రెండు దశాబ్దాలు అవుతుంది. ఇన్నేళ్ళలో అతనొక్కడే, పటాస్ మాత్రమే హిట్ చిత్రాలుగా ఉన్నాయి. 

పటాస్ విడుదలై ఏడేళ్లకు బింబిసార చిత్రంతో హిట్ కొట్టాడు. అంత పెద్ద ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉండి కూడా కళ్యాణ్ రామ్ తనకంటూ ఓ మార్కెట్ ఏర్పాటు చేసుకోలేదు. మెగా టూ టైర్ హీరోలైన వరుణ్ తేజ్, ధరమ్ తేజ్ కి ఉన్న మార్కెట్ కూడా కళ్యాణ్ రామ్ కి లేదు. కారణం కళ్యాణ్ రామ్ సినిమా అంటే లాటరీతో సమానం. ఎప్పుడో ఒకటి క్లిక్ అవుతుంది. 

అయితే ఎనిమిది నెలల వ్యవధిలో నందమూరి హీరోలైన బాలకృష్ణ, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ హిట్స్ ఇచ్చారు. అఖండ భారీ లాభాలతో ఇండస్ట్రీ హిట్ కొట్టింది. ఎన్టీఆర్ నటించిన ఆర్ ఆర్ ఆర్ వరల్డ్ వైడ్ రూ. 1100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. లేటెస్ట్ మూవీ బింబిసార(Bimbisara) మూడు రోజుల్లో బ్రేక్ ఈవెన్ కి చేరింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో బింబిసార వీకెండ్ ముగిసే నాటికి రూ. 15 కోట్లకు పైగా షేర్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు రిపోర్ట్ చేస్తున్నాయి. 

ఈ క్రమంలో నందమూరి ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కొంచెం అతి చేస్తున్నారు. కష్టకాలంలో టాలీవుడ్ ని తమ హీరోలైన ఎన్టీఆర్, బాలయ్య, కళ్యాణ్ రామ్(Kalayan Ram) కాపాడారు అంటున్నారు. ఇది నందమూరి నామ సంవత్సరం. టాలీవుడ్ కింగ్స్ అంటే నందమూరి హీరోలే అని కాలర్ ఎగరేస్తున్నారు. తమని తాము పొగుడుకుంటే పర్లేదు మెగా హీరోలను తక్కువ చేసి మాట్లాడుతూ పైత్యం చూపిస్తున్నారు. చిరంజీవి బిరుదైన మెగాస్టార్ కళ్యాణ్ రామ్ కి తగిలించి ట్విట్టర్ లో ట్రెండ్ చేసిన విషయం తెలిసిందే. ఇదంతా గమనిస్తున్న యాంటీ ఫ్యాన్స్... నందమూరి ఫ్యాన్స్ కి బడాయి ఎక్కువైందని. మూడు హిట్స్ ఇచ్చినంత మాత్రాన ఇంత అతి అవసరమా అంటూ సెటైర్స్ వేస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios