యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ విడుదల మరింత ప్రత్యేకంగా మార్చేశారు. ప్రపంచంలోనే ఫస్ట్ ప్రీమియర్ షో తాను సొంతం చేసుకున్నాడు. ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ కోసం ఎన్టీఆర్ తీసుకున్న ఈ నిర్ణయం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది.
ఆర్ ఆర్ ఆర్ (RRR Movie)విడుదలకు కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. ఏడాదికి పైగా విడుదల వాయిదా పడుతూ వస్తున్న ఆర్ ఆర్ ఆర్ మూవీ జర్నీ మొదలై దాదాపు నాలుగేళ్లవుతోంది. ఈ క్రమంలో అనేక ఒడిదుడుకులు, కష్టనష్టాలు చిత్ర యూనిట్ ఎదుర్కొన్నారు. ఎన్టీఆర్, చరణ్ లకు గాయాలు, ఆ తర్వాత కరోనా... అనేక సవాళ్ళను దాటుకొని ఆర్ ఆర్ ఆర్ మార్చి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎదురు చూస్తున్న ఆర్ ఆర్ ఆర్ ఫస్ట్ షో మార్చి 24 అర్ధరాత్రి యూఎస్ లో పడనుంది.
ఇక తెలుగు రాష్ట్రాల్లో తెల్లవారుజామునుండే ఆర్ ఆర్ ఆర్ ప్రీమియర్స్ (RRR Movie Premier show) ప్రదర్శనలు జరగనున్నాయి. అయితే యూఎస్ కంటే ముందే హైదరాబాద్ లో ఆర్ ఆర్ ఆర్ ప్రీమియర్ షోకి సర్వం సిద్ధమైంది. ఏఎంబీ సినిమాస్ లో మార్చి 24 రాత్రి 9 గంటలకు ఆర్ ఆర్ ఆర్ ప్రత్యేక ప్రదర్శన జరగనుంది. ఎన్టీఆర్ ఈ షోని తన ఫ్రెండ్స్, కుటుంబ సభ్యుల కోసం ప్రత్యేకంగా బుక్ చేశారు. 52 రీక్లైనింగ్ సీట్స్ థియేటర్ ని ఎన్టీఆర్ బుక్ చేశారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులతో పాటు పరిశ్రమకు చెందిన మిత్రులు ఈ షోకి హాజరుకానున్నారు.
కాబట్టి ఆర్ ఆర్ ఆర్ ఫస్ట్ ప్రీమియర్ షో హైదరాబాద్ లోనే వేయనున్నారు.ఇక ఎన్టీఆర్(NTR), రాజమౌళి, రామ్ చరణ్ లతో కూడిన ఆర్ ఆర్ ఆర్ టీమ్ అన్ని ప్రధాన నగరాలు తిరిగి ప్రమోషన్స్ నిర్వహించారు.దుబాయ్, ఢిల్లీ, ముంబై, బెంగుళూరు, చెన్నై, వారణాసి, అమృత్ సర్, జైపూర్ వంటి నగరాల్లో ఆర్ ఆర్ ఆర్ ప్రమోషనల్ ఈవెంట్స్ ఏర్పాటు చేయడం జరిగింది.
బాహుబలి చిత్రానికి మించిన ప్రీ రిలీజ్ బిజినెస్ ఆర్ ఆర్ ఆర్ కి జరిగింది. ఆర్ ఆర్ ఆర్ బ్రేక్ ఈవెన్ కావాలంటే ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 550 కోట్ల షేర్ వసూలు చేయాలి. ఎన్టీఆర్, రాజమౌళి, రామ్ చరణ్ లతో కూడిన ఆర్ ఆర్ ఆర్ టీమ్ అన్ని ప్రధాన నగరాలు తిరిగి ప్రమోషన్స్ నిర్వహించారు.దుబాయ్, ఢిల్లీ, ముంబై, బెంగుళూరు, చెన్నై, వారణాసి, అమృత్ సర్, జైపూర్ వంటి నగరాల్లో ఆర్ ఆర్ ఆర్ ప్రమోషనల్ ఈవెంట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మార్చి 23న హైదరాబాద్ లో జరిగే ఈవెంట్ తో ఆర్ ఆర్ ఆర్ ప్రమోషన్స్ ముగియనున్నాయి.
దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli)భారీ బడ్జెట్ తో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఆర్ ఆర్ ఆర్ తెరకెక్కించారు. ఎన్టీఆర్ కొమరం భీం రోల్ చేస్తుండగా, రామ్ చరణ్ (Ram Charan)అల్లూరి సీతారామరాజు పాత్ర చేస్తున్నారు. నిర్మాత డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించారు. అలియా భట్ హీరోయిన్ గా నటిస్తుండగా... అజయ్ దేవ్ గణ్ కీలక రోల్ చేశారు. శ్రీయా శరన్, సముద్ర ఖని నటిస్తున్నారు.
