Asianet News TeluguAsianet News Telugu

జూనియర్ ఎన్టీఆర్ కథలు చెప్తున్నాడు

  • జైలవకుశ సక్సెస్ మీట్ లో కథ చెప్పిన జూనియర్ ఎన్టీఆర్
  • జయోత్సవం పేరుతో జైలవకుశ సక్సెస్ మీట్
  • సక్సెస్ పై టీమ్ మెంబర్స్ కు థాంక్స్ చెప్తూనే... క్రిటిక్స్ పై విమర్శలు
ntr ANGRY ON film critics for jai lavakusa reviews

మొత్తానికి జై లవకుశతో మరో సక్సెస్ సాధించిన జూనియర్ ఎన్టీఆర్ జైయోత్సవం పేరుతో నిర్వహించిన సక్సెస్ మీట్ లో కథ చెప్పాడు. చావు బతుకుల మధ్య కొట్టు మిట్టాడుతున్న ఓ పేషంట్.  ఆసుపత్రికి తీసుకుని వచ్చి డాక్టర్లకు చూపిస్తే.. టెస్ట్ లు చేస్తూ ఎటూ తేల్చకుండా కాస్త సమయం ఇవ్వండి టెస్ట్ అయిపోయాక చెప్తాం అంటూ టెన్షన్ పెట్టే తీరు. కుటుంబ సభ్యులకు తము తీసుకొచ్చిన తమ కుటుంబంలో ఒకడైన పేషంట్ ఎలాగైనా బతకాలి అని ఆశతో ఎదురు చూసే పరిస్థితి. ఇలా సదరు పేషంట్ చస్తాడా, బతుకుతాడా తెలియని సందిగ్దతలో టెన్షన్ పడుతుంటే... మరోవైపు బతికున్న పేషంట్ ను బతికే సవాలే లేదు. చచ్చిపోతాడుఅని, అసలు చచ్చేపోయాడు అని చెప్పే కొందరుంటారు. అంటూ విశ్లేషకులపై విరుచుకుపడ్డారు జూనియర్. ఇంతకీ ఈ కథకు సినీ విష్లేశకుల ఏంటి సంబంధం అంటే... ఈ కథలో చావకున్నా చచ్చాడని చెప్పే దారినపోయే దానయ్యలే విశ్లేషకులు అంటూ విమర్శలు చేస్తూ కథ చెప్పారు ఎన్టీఆర్.

 

ఎన్టీఆర్ జైలవకుశ చిత్రం హిట్ టాక్ సొంతం చేసుకుంది. అయితే కలెక్షన్స్ అనుకున్న స్థాయిలో రాలేదనిపించిందో.. మరేమైనా అనిపించిందో కానీ జూనియర్ ఎన్టీఆర్ తన ‘జై ల కుశ’ సక్సెస్ మీట్ లో అసహనాన్ని వ్యక్తం చేస్తూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి. ‘జై లవ కుశ’ పరాజయాన్ని పరోక్షంగా అంగీకరిస్తూ ఈసినిమా పై నెగిటివ్ కామెంట్స్ చేశాడా అని ఇప్పుడు కొత్త చర్చకు తెరలేపాడు జూనియర్. దీన్నిబట్టి చూస్తుంటే జూనియర్ ప్రస్తుతం ‘జై లవ కుశ’ రిజల్ట్ పట్ల ఎంత అసహనంతో ఉన్నాడో అర్ధం అవుతుంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి.

 

అయితే తన సినిమా ఘనవిజయం సాధించిందని ఏమర్జనీ కేర్ లో ఉన్న సినిమాలకు కూడ వైద్యం చేసి ప్రాణం పోయగల వైద్యులు ప్రేక్షకులు మాత్రమే అంటూ తన ‘జై లవ కుశ’ పరాజయం పై పరోక్ష అంగీకారంతో ఆసక్తికర కామెంట్స్ చేసాడు. అంతేకాదు ఈమూవీ పై నెగిటివ్ కామెంట్స్ ప్రచారం చేస్తున్న దారినపోయే దానయ్యలకు అసలు సినిమాలు చూడటం, విశ్లేషించడం రాదు అంటూ మరొక ఆసక్తికర కమెంట్ చేశాడు జూనియర్.

 

కొద్ది నెలల క్రితం ‘దువ్వాడ జగన్నాథం’ పరాజయం తరువాత అల్లు అర్జున్ కూడ ఇదే విధంగా నెగిటివ్ కామెంట్స్ వ్రాసిన మీడియా వర్గాలను టార్గెట్ చేస్తూ కామెంట్ చేసాడు.  దీనితో జూనియర్ బన్నీ అడుగుజాడలలో పయనిస్తున్నాడా అన్న కామెంట్స్ వస్తున్నాయి. అయితే జూనియర్ గతంలో నటించిన ‘జనతా గ్యారేజ్’ ‘నాన్నకు ప్రేమతో’ సినిమాలను మెచ్చుకుంటూ కామెంట్స్ చేసిన ఇదే దారినపోయే దానయ్యల సంగతి జూనియర్ మర్చిపోయాడా అంటూ సెటైర్లు పడుతున్నాయి. ఏమైనా జూనియర్ అసహనం ప్రస్తుతం మీడియా సర్కిల్లో హాట్ టాపిక్ గా మారింది.

Follow Us:
Download App:
  • android
  • ios