రెండు ఫ్యామిలీకి చెందిన పెద్ద స్టార్లు ఒకే సినిమాలో కలిసి నటిస్తే కన్నుల పండుగగా ఉంటుంది. అలాంటి అరుదైన కాంబినేషన్స్.. మన దగ్గర చాలా తక్కువగా సెట్ అవుతుంటాయి. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్- రామ్ చరణ్ కలిసి ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. 

ఈ ప్రాజెక్టు గురించి ఇంకా అధికంగా ఏ ప్రకటన రాలేదు.. ఇప్పటికే చిత్ర కథకథనాలు.. పాత్రలపై అనేక రూమర్స్ వచ్చాయి. ఇప్పుడు వినిపిస్తున్న లేటెస్ట్ గాసిప్ ఏంటంటే.. ఈ సినిమాలో ఎన్టీఆర్  చరణ్ అన్నాదమ్ములుగా కనిపించనున్నారట. అటు ఏజ్ ప్రకారం చూసుకున్నా.. ఇటు సీనియారిటీ ప్రకారం చూసుకున్నా.. ముఖ కవళికల ప్రకారం చూసుకున్నా.. ఎలాగైనా సరే అన్న పాత్రకు ఎన్టీఆర్.. తమ్ముడి రోల్ లో చరణ్ అని కన్ఫమ్ చేసుకోవచ్చు.  గతంలో అయితే.. ఈ చిత్రం బాక్సింగ్ నేపథ్యంతో ఉంటుందనే ప్రచారం జరిగింది. వీళ్లిద్దరి కి ఒక ఫైట్ కూడా ఉంటుందని ప్రచారం జరుగుతుంది. మరి ఇది ఎంత వరకు నిజం అనేది వేచి చూడాలి.

ఇది రాజమౌళి స్టైల్ లో తెరకెక్కించనున్న యాక్షన్ ఫలిం అనే మాటే ఎక్కువగా వినిపిస్తోంది. ఇప్పుడు నందమూరి స్టార్ హీరో అన్నగాను... మెగా ఫ్యామిలీ హీరో తమ్ముడి గా నటిస్తే ఆడియన్స్ కు మంచి కిక్కెక్కించే న్యూస్. కానీ ఇది ఎంత వరకు నిజం అవుతుందో లేక అన్ని గాసిప్పుల మాదిరిగా తేలిపోతుందో చూడాలి.