తెలుగులో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న చిత్రం `ఆర్‌ ఆర్‌ ఆర్‌`. పాన్‌ ఇండియా సినిమాగా దీన్ని రూపొందిస్తున్నారు. దాదాపు నాలుగు వందల కోట్ల బడ్జెట్‌లో డివివి  దానయ్య ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ హీరోలుగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో రామ్‌చరణ్‌.. అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్‌.. కొమురంభీమ్‌గా నటిస్తున్నారు. అలియా భట్‌, బ్రిటీష్‌ నటి ఒలీవియా మొర్రీస్‌ హీరోయిన్లుగా, అజయ్‌ దేవగన్‌, సముద్రఖని, శ్రియా కీలక పాత్రధారులుగా నటిస్తున్నారు. 

ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించింది చిత్ర బృందం. దసరా కానుకగా అక్టోబర్‌ 13న విడుదల చేయబోతున్నట్టు వెల్లడించింది. నీరు, నిప్పు కలిసి పోరాడేది అప్పుడే అంటూ సోషల్‌ మీడియా ద్వారా ప్రకటించింది యూనిట్‌. `అక్టోబర్‌ 13, ఫైర్‌, వాటర్‌ వేర్‌ కలిసి ఫోర్స్ గా వచ్చేందుకు సాక్ష్యం. భారతీయ సినిమాల్లోనే అతిపెద్ద కొలాబరేషన్‌ సెట్‌ అయి చిరస్మరణీయమైన అనుభవాన్ని అందించడానికి సిద్ధంగా ఉంది. ది రైడ్‌ ప్రారంభమైంది` అని పేర్కొన్నారు. 

ఇదిలా ఉంటే ఇందులో నటిస్తున్న ఐరీష్‌ నటి చిత్ర విడుదల తేదీ అక్టోబర్‌ 8న అని తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసి, ఆ వెంటనే తన తప్పుని తెలుసుకుని డిలీట్‌ చేసింది. కానీ అప్పటికే అది జనంలోకి వెళ్లిపోయింది. దీంతో `ఆర్‌ ఆర్‌ ఆర్‌` రిలీజ్‌ డేట్‌ లీక్‌ కావడంతో తల పట్టుకున్న రాజమౌళి టీమ్‌ ఎట్టకేలకు విడుదల తేదీని ప్రకటించారు. ఐదు రోజులు మార్పుతో సినిమాని విడుదల చేయబోతున్నట్టు తెలిపారు. అయితే తాజాగా పంచుకున్న పోస్టర్‌ సినిమాపై మరింత ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఇందులో గుర్రంపై రామ్‌చరణ్‌, బుల్లెట్‌పై ఎన్టీఆర్‌ ఆవేశంతో వెళ్తున్నట్టుగా ఉంది. ఇటీవల క్లైమాక్స్ షూటింగ్‌ని ప్రారంభించిన విషయం తెలిసిందే. దీంతో షూటింగ్‌ పూర్తయ్యే ఛాన్స్ ఉందని టాక్‌. దాదాపు పది భాషల్లో ఈ సినిమాని విడుదల చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు.