Asianet News TeluguAsianet News Telugu

ఎన్టీఆర్-జాన్వీ సోప్ యాడ్ లో నటించారా? సాంగ్ ని ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారుగా!

దేవర సాంగ్ ని యాంటీ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు. పాట సోప్ యాడ్ లా ఉందంటూ ఎడిటింగ్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. 
 

ntr and janhvi kapoor devara song getting trolled ksr
Author
First Published Aug 6, 2024, 1:53 PM IST | Last Updated Aug 6, 2024, 1:53 PM IST

జూనియర్ ఎన్టీఆర్ - జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ' దేవర '. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. నిజానికి ఈ మూవీ అక్టోబర్ లో రిలీజ్ చేయనున్నట్లు టీం ప్రకటించింది. కానీ ఇటీవల సెప్టెంబర్ 27 కి  రిలీజ్ డేట్ ప్రీపోన్ చేశారు. అనుకున్నదాని కంటే ముందే  ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. కాగా ఇప్పటికే దేవర నుంచి రిలీజ్ అయిన ఫియర్ సాంగ్ సోషల్ మీడియాని షేక్ చేసింది. 

అయితే తాజాగా దేవర నుండి రెండో పాటను విడుదల అయింది.   కాగా ఈ రొమాంటిక్ సాంగ్ ఆకట్టుకుంది. ఈ సాంగ్  లిరిక్స్ కైపెక్కిస్తున్నాయి. చుట్టమల్లే చుట్టేస్తోంది .. అంటూ సాగె ఈ పాట మెస్మరైజ్ చేస్తుంది. ఈ లిరికల్ వీడియోలో జాన్వీ కపూర్ - ఎన్టీఆర్ మధ్య కెమిస్ట్రీ చాలా అద్భుతంగా ఉంది. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. అనిరుద్ మ్యూజిక్, శిల్పా మధురమైన  గాత్రం పాటకు ప్రాణం పోశాయి. ఈ  లిరిక్స్ వింటుంటే మ్యూజిక్ లవర్స్ కి స్వర్గం అంతే ..  

అయితే దేవర సాంగ్ ని యాంటీ ఫ్యాన్స్ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఈ పాట సోప్ యాడ్ ని తలపిస్తుందని ఎద్దేవా చేస్తున్నారు. ఎడిటింగ్ వీడియోలతో సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. అయితే ట్రోలర్స్ టాలెంట్ ని మెచ్చుకోవాల్సిందే. ఆ రేంజ్ లో ఎడిటింగ్ వీడియోలు ఉన్నాయి. చాలా సహజంగా వీడియోలు ఎడిట్ చేసి వదిలారు. 

ఆ విషయం పక్కన పెడితే... దేవర రెండు భాగాలుగా విడుదల కానుంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడని సమాచారం. ఎన్టీఆర్ రోల్ దేవర లో చాలా పవర్ ఫుల్ గా దర్శకుడు కొరటాల శివ డిజైన్ చేశాడు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios