తాజాగా మరో రెండు ఫోటోలను షేర్‌ చేశారు. ఇందులో ఎన్టీఆర్‌ తన చిన్న కుమారుడు భార్గవ్‌ రామ్‌తో దిగిన పిక్‌ని షేర్‌ చేశారు. కారులో షికారుకి వెళ్తూ భార్గవ్ రామ్‌ని ప్రేమతో ముద్దాడుతున్న పిక్‌ని పంచుకున్నారు.

`ఆర్‌ఆర్‌ఆర్‌`(RRR) స్టార్‌, యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌(Ntr) వెకేషన్‌ ఎంజాయ్‌ చేస్తున్నారు. రెండు రోజులుగా ఆయన గ్యాప్‌ లేకుండా విహారయాత్రలో మునిగి తేలుతున్నారు. ఎన్టీఆర్‌ వెకేషన్‌(Ntr Vacation) కోసం పారిస్‌కి వెళ్లిన విషయం తెలిసిందే. ఆదివారం ఆయన తన పెద్ద కుమారుడు అభయ్‌రామ్‌తో దిగిన పిక్‌ని పంచుకున్నారు. ఈఫిల్ టవర్‌ బ్యాక్ డ్రాప్‌లో అభయ్‌రామ్‌ని ప్రేమతో ముద్దాడుతున్న పిక్‌ని ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పంచుకున్నారు ఎన్టీఆర్‌. తాజాగా మరో రెండు ఫోటోలను షేర్‌ చేశారు. 

ఇందులో ఎన్టీఆర్‌ తన చిన్న కుమారుడు భార్గవ్‌ రామ్‌(Bhargav Ram)తో దిగిన పిక్‌ని షేర్‌ చేశారు. కారులో షికారుకి వెళ్తూ భార్గవ్ రామ్‌ని ప్రేమతో ముద్దాడుతున్న పిక్‌ని పంచుకున్నారు. దీంతోపాటు తన భార్య లక్ష్మీ ప్రణతి సైతం భార్గవ్‌ రామ్‌తో ఆడుకుంటున్న క్యూట్‌ పిక్‌ని అభిమానులతో పంచుకున్నారు ఎన్టీఆర్‌.ఈ సందర్భంగా ఓ పోస్ట్ పెట్టారు. ఈ వెకేషన్‌ గురించి చాలా విషయాలను పంచుకోవాలనుందట. కానీ ప్రస్తుతం ఆ జర్నీని ఎంజాయ్‌ చేస్తున్నామని తెలిపారు. ఈ లెక్కన త్వరలో ఆయన మరిన్ని విశేషాలను చెప్పాలనుకుంటున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 

View post on Instagram

ఎన్టీఆర్‌ శనివారం హాలీడేస్‌ నిమిత్తం విదేశాలకు వెళ్లిన విషయం తెలిసిందే. ఫ్యామిలీతో కలిసి ఆయన వెకేషన్‌కి వెళ్తూ ఎయిర్‌పోర్ట్ లో ఫోటోలకు చిక్కారు. ఆ పిక్స్ సందడి చేశాయి. ఈ నేపథ్యంలో తారక్ తన వెకేషన్‌ పిక్స్ ని పంచుకుంటూ తాను బాగా ఎంజాయ్‌ చేస్తున్న విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. దీంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఆయనకు అభినందనలు తెలియజేస్తున్నారు. అంతేకాదు భార్గవ్‌ రామ్‌ చాలా క్యూట్‌గా ఉన్నాడంటూ పోస్ట్ లు పెడుతున్నారు. 

ఎన్టీఆర్‌.. ప్రస్తుతం `ఆర్‌ఆర్‌ఆర్‌` చిత్రంలో నటిస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకుని విడుదలకు రెడీ అవుతుంది. పోస్ట్ ప్రొడక్షన్‌ పనులను జరుపుకుంటోంది. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంతో ఎన్టీఆర్‌తోపాటు రామ్‌చరణ్‌ మరో హీరోగా నటిస్తున్నారు. స్వాతంత్రోద్యమంలో పాల్గొనడానికి ముందు అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్‌ ఏం చేశారు, ఎలాంటి పోరాటాలు చేశారనే కథాంశంతో ఈ చిత్రాన్ని ఫిక్షనల్‌గా తెరకెక్కిస్తున్నారు జక్కన్న. ఇప్పటికే విడుదలైన టీజర్‌ సినిమాపై అంచనాలను పెంచేసింది. గూస్‌బంమ్స్ ని తెప్పిస్తుంది. ఈ చిత్రాన్ని జనవరి 7న ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల చేయబోతున్నారు. ఈ నెల 26న ఈ చిత్రానికి సంబంధించిన `జనని` అంటూ సాగే మరోపాటని విడుదల చేయబోతున్నారు. 

సినిమాలో ఎన్టీఆర్ కి జోడీగా బ్రిటీష్‌ నటి ఒలివియా మోర్రీస్‌, చరణ్‌కి జోడీగా బాలీవుడ్ నటి అలియాభట్‌ నటిస్తున్నారు. అజయ్‌ దేవగన్‌, శ్రియా కీలక పాత్రలు పోసిస్తున్నారు. డివివి దానయ్య దాదాపు ఐదు వందల కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాని తెరకెక్కించారు. పది భాషల్లో సినిమాని రిలీజ్‌ చేయబోతున్నారు. మరోవైపు ఎన్టీఆర్‌.. కొరటాల శివతో ఓ సినిమా చేయనున్నారు. ఇది ఎన్టీఆర్‌ వెకేషన్‌ పూర్తి చేసుకుని వచ్చాక షూటింగ్‌ స్టార్ట్ చేయబోతున్నారని టాక్. 

also read: RRR Update: `ఆర్‌ఆర్‌ఆర్‌` మూడో పాట రెడీ.. `జనని` వచ్చేది ఎప్పుడంటే?