నందమూరి హీరోలకు సంక్రాంతి సందడి లేకుండా పోయింది. నందమూరి హీరోలైన బాలకృష్ణ, ఎన్టీఆర్ మరియు కళ్యాణ్ రామ్ నుండి ఎటువంటి అప్డేట్ లేకపోవడమే కారణం. బాలయ్య-బోయపాటి మూవీ నుండి కనీసం సంక్రాంతి విషెష్ పోస్టర్ లేదు. బాలయ్య సెకండ్ లుక్ లేదా హీరోయిన్స్ కి సంబంధించిన అప్డేట్ ఉంటుందని ఆయన డై హార్డ్ ఫ్యాన్స్ భావించారు. సంక్రాంతి హీరో అయిన బాలయ్య ఎటువంటి నూతన విషయం చెప్పకనే సంక్రాంతి ముగించేలా ఉన్నాడు. 

ఇక ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ లో బిజీగా ఉన్న ఎన్టీఆర్ నుండి కూడా ఎటువంటి అప్డేట్ రాలేదు. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ 30వ చిత్రం చేస్తున్నారు. దీనిపై ఖచ్చితంగా అప్డేట్ ఉంటుందని ఫ్యాన్స్ భావించారు. ఈ మూవీ టైటిల్ పోస్టర్ సంక్రాంతి కానుకగా విడుదల అవుతుందని ఆశలు పెట్టుకోగా అది కూడా జరగలేదు. ఎన్టీఆర్ నటిస్తున్న ఆర్ ఆర్ ఆర్ నుండి ఎటువంటి అప్డేట్ ఉండదని ముందుగానే దర్శక నిర్మాతలు హింట్ ఇవ్వడంతో దానిపై ఫ్యాన్స్ కి ఎటువంటి ఆశలు లేవు. 

కనీసం త్రివిక్రమ్ మూవీపై అప్డేట్ ఉంటుందని ఆశించిన ఫ్యాన్స్ కి నిరాశే ఎదురైంది. గత ఏడాది సంక్రాంతికి ఎంత మంచివాడవురా మూవీతో ప్రేక్షకులను పలకరించారు కళ్యాణ్ రామ్. ఆ మూవీ కూడా కళ్యాణ్ రామ్ కి సరైన బ్రేక్ ఇవ్వలేక పోయింది. ఈ సంక్రాంతికి ఆయన నుండి కూడా ఎటువంటి అప్డేట్ రాలేదు. కాకపోతే ఫేడ్ అవుటైన నందమూరి హీరో తారక రత్న దేవినేని ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. దీనిపై నందమూరి అభిమానులకే అంతగా ఆసక్తి లేదు.