ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్స్ గా మారిపోయారు ఎన్టీఆర్ రామ్ చరణ్, ఇప్పటిక విరి దగ్గరకు బాలీవుడ్ నుంచి చాలా ప్రపోజల్స్ వచ్చాయి. ఇక బాలీవుడ్ మూవీ గురించి తన మనసులో మాటను బయట పెట్టాడు తారక్.
ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్స్ గా మారిపోయారు ఎన్టీఆర్ రామ్ చరణ్, ఇప్పటిక విరి దగ్గరకు బాలీవుడ్ నుంచి చాలా ప్రపోజల్స్ వచ్చాయి. ఇక బాలీవుడ్ మూవీ గురించి తన మనసులో మాటను బయట పెట్టాడు తారక్.
ఎన్టీఆర్ ఇప్పుడు ఆర్ఆర్ఆర్‌కు ముందు టాలీవుడ్ ఆర్ఆర్ఆర్ రిలీజ్ తర్వాత హీరో అన్నట్టు మారిపోయింది. లోకల్ హీరోగా ఉన్న తారక్ ఇప్పుడు పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. ట్రిపుల్ ఆర్ బాక్సాపీస్‌ను షేక్ చేస్తూ కలెక్షన్ల వర్షం కురిపించడంతో... తారక్ ఈ సినిమాతో తొలిసారి నార్తిండియా ఆడియెన్స్ లో మంచి క్రేజ్ సంపాదించాడు.
ట్రిపుల్ ఆర్ కోసం పర్ఫెక్ట్ హిందీ నేర్చుకున్నాడు తారక్. హిందీ సినిమాలు దృష్టిలో పెట్టుకునే ఇలా చేశాడన్న మాటలు కూడా వినిపించాయి అప్పుడు ఇక ఇప్పుడు ఇండియావైడ్‌గా ప్రేక్షకులకు కనెక్ట్ అయిపోయాడు తారక్. ఇపుడు ఆర్ఆర్ఆర్‌తో హిందీ ప్రేక్షకుల దగ్గర మంచి ఇంప్రెషన్ కొట్టేశాడు.
ట్రిపుల్ ఆర్ పుణ్యమా అని ఎన్టీఆర్‌కు ఇపుడు బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థల నుంచి భారీ ఆఫర్లు వస్తున్నట్టు తెలుస్తోంది. స్టార్ డైరెక్టర్లు తారక్ కోసం కథలు కూడా సిద్ధం చేసుకుంటున్నారట. ఈ నేపథ్యంలో డైరెక్ట్ హిందీ సినిమా చేయడం గురించి ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు ఎన్టీఆర్ క్లారిటీగా సమాధానం ఇచ్చాడు.
ఎన్టీఆర్ తన మనసులో మాటను బయట పెట్టారు. మంచి హిందీ సినిమాలో నటించాలని ఉంది. భాషలే వేరు కానీ సినిమ తాలూకు ఎమోషన్స్ , డ్రామా మాత్రం ఎప్పటికీ మారవన్నాడు. ఏ దర్శకులతో పనిచేయడమంటే ఇష్టమన్న ప్రశ్నకు స్పందిస్తూ..రాజ్ కుమార్ హిరానీ, సంజయ్ లీలా బన్సాలీ లతో పనిచేయాలని ఉందని చెప్పాడు.
బాలీవుడ్‌లో చాలా మందిఉన్నారు. కానీ రాజ్ కుమార్ హిరానీ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన తీసే సినిమాలు యాక్టర్లను అద్దం ముందు నిలబెడతాయి. సంజయ్ లీలా బన్సాలీ సినిమాలన్నా నాకు చాలా ఇష్టం. ఆయన సినిమాల్లో బలమైన పాత్రలున్నాయి. బన్సాలీ సినిమాలు తీసే విధానం..ఆయన అద్భుతమైన, పెద్ద కాన్వాస్ సినిమాలంటే నాకు కూడా ఇష్టం అనిచెప్పుకొచ్చాడు తారక్.
తారక్ అడుగులు బాలీవుడ్ వైపు పడుతున్నాయి. కొరటాల శివతో సినిమా అయిపోగానే ప్రశాంత్ నీల్ సినిమా చేయబోతున్నాడు తారక్. ఈ రెండింటి తరువాత ఎన్టీఆర్ పక్కాగా బాలీవుడ్ లో సినిమా చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఇక కోరటాల సినిమాను జూన్ లో స్టార్ట్ చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం.
