Asianet News TeluguAsianet News Telugu

బిచ్చగాడు లాంటి సినిమాలు రావాలి.. బాహుబలిలు కాదంటున్న సీనియర్ నటుడు

  • బాహుబలి సినిమా భారీ బజట్ తో తెరకెక్కింది తప్ప ఏమీ లేదంటున్న సీనియర్ నటుడు
  • బిచ్చగాడు సినిమా లాంటివి రావాలి కానీ బాహుబలి లాంటివి కాదంటున్న పెద్దాయన
nothing is there in bahubali movie says kaikala satyanarayana

తెలుగు సినిమా స్ఠాయిని ప్రపంచ స్థాయికి పెంచిన సినిమాగా బాహుహలి చిత్రం ఎంతటి క్రేజ్ సంపాదించిందో తెలిసిందే. అయితే ఆ సినిమాను ఓ సీనియర్ నటుడు మాత్రం తేలిగ్గా కొట్టిపారేస్తున్నారు. ఓ పక్కన ‘బాహుబలి’ రెండో భాగం కోసం ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా అంత కంటే భారీ కలెక్షన్లు సాధించింది. కానీ సీనియర్‌ నటుడు కైకాల సత్యనారాయణ ‘బాహుబలి’ సినిమాలో అలు ఏముంది అని ప్రశ్నిస్తున్నారు. ఓ యూట్యూబ్‌ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ‘బాహుబలి’ గురించి మాట్లాడారు.

 

‘నేను ‘బాహుబలి’ సినిమా చూశా. ఏముంది అందులో. కథగా చెప్పుకోవడానికి అసలేముంది. ఆ సినిమా గురించి చాలా సింపుల్‌గా మూడు వాక్యాల్లో చెప్పొచ్చు. భారీ సెట్లు, గ్రాఫిక్స్‌ మాత్రం ఉన్నాయి. మా రోజుల్లో వాటిని ‘ట్రిక్స్‌’ అనే వాళ్లం. ఇప్పుడు దానికి అందమైన పేరు పెట్టి ‘గ్రాఫిక్స్‌’ అంటున్నారు. మన మార్కెట్‌కు ఐదొందల కోట్లు పెట్టాల్సిన అవసరముందా?. ఆ బడ్జెట్‌తో ఐదొందల సినిమాలు చేసుకోవచ్చు. అయినా ఇలాంటి సినిమాలను హాలీవుడ్‌ వాళ్లు ఎప్పుడో తీశారు. వీటన్నింటినీ ఎన్నో ఇంగ్లీష్‌ సినిమాల్లో చూశాం.

 

బోలెడు ఖర్చుపెట్టి సెట్‌లు వేసి సినిమా తీసేస్తే మన తెలుగు సినిమా స్థాయి పెరిగినట్టేనా? మొన్న ‘బిచ్చగాడు’ అనే చిన్న సినిమా వచ్చింది. బ్రహ్మాండంగా ఆడింది. గతంలో వచ్చిన ఎన్నో సినిమాలు అద్భుతంగా ఆడాయి. వాటిల్లో నీతి కూడా ఉండేది. కళ్లు జిగేల్‌మనిపించేలా సెట్లు వేసేస్తే తెలుగు సినిమా స్థాయి పెరిగినట్టా’ అని కైకాల సత్యనారాయణ అభిప్రాయ పడ్డారు.

Follow Us:
Download App:
  • android
  • ios