విజయ్ లాంటి హీరో రాజకీయ నాయకుడిగా కనిపిస్తాడని ముందుగా ఎవరు ఊహించలేదు. లవర్ బాయ స్టార్ డమ్ నుంచి పూర్తిగా ఆడియెన్స్ ను డైవర్ట్ చేసే విధంగా బలే ప్లాన్ చేశాడు. చెప్పినట్టుగానే కెరీర్ లో ఒకదానికొకటి సంబంధం లేకుండా ట్రై చేస్తున్నాడు.
రాజకీయ నేపథ్యంలో తెరకెక్కిన విజయ దేవరకొండ నోటా సినిమాపై ప్రస్తుతం క్రేజ్ బాగా పెరుగుతోంది. విజయ్ లాంటి హీరో రాజకీయ నాయకుడిగా కనిపిస్తాడని ముందుగా ఎవరు ఊహించలేదు. లవర్ బాయ స్టార్ డమ్ నుంచి పూర్తిగా ఆడియెన్స్ ను డైవర్ట్ చేసే విధంగా బలే ప్లాన్ చేశాడు. చెప్పినట్టుగానే కెరీర్ లో ఒకదానికొకటి సంబంధం లేకుండా ట్రై చేస్తున్నాడు.
అసలు మ్యాటర్ లోకి వస్తే.. నోటా రెండు భాషల్లో రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. అయితే ముందుగా సినిమా తమిళ్ సెన్సార్ పనులను పూర్తి చేసుకుంది. ఎలాంటి కట్స్ లేకుండా అక్కడ క్లీన్ 'U' సర్టిఫికెట్ ఇవ్వడం ఆశ్చర్యపరుస్తోంది. రాజకీయ నేపథ్యంలో తెరకెక్కుతున్న సీరియస్ కథకు యూ సర్టిఫికెట్ రావడంతో సినిమాపై అంచనాలను కూడా పెంచుతోంది.
త్వరలోనే తెలుగులో కూడా సెన్సార్ పనులను ఫినిష్ చేసేవిధంగా దర్శకుడు ఆనంద్ శంకర్ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ ద్విభాషా చిత్రం వరల్డ్ వైడ్ అక్టోబర్ 5న రిలీజ్ కాబోతోంది. ఇక విజయ్ దేవరకొండ సరసన సినిమాలో మెహ్రీన్ కథానాయికగా నటించిన సంగతి తెలిసిందే.
