కెనడియన్ భామ నోరా ఫతేహీ పేరు చెబితే వెంటనే టెంపర్ చిత్రంలోని ఐటెం సాంగ్ గుర్తుకు వస్తుంది. ఈ భామ   ‘బాహుబలి’ లో ప్రభాస్‌తో ‘మనోహరి…’ అనే పాటకు నర్తించింది. పాట పూర్తి కాగానే ప్రభాస్ తో సెల్ఫీ తీసుకుని, ప్రభాస్ చాలా మంచివాడని కితాబు కూడా ఇచ్చింది.   తెలుగులో వ‌చ్చిన టెంప‌ర్‌లో ఇట్టాగే రెచ్చిపోదాం అనే పాట‌కి డ్యాన్స్ వేసి అల‌రించిన నోరా రవితేజ ‘కిక్‌-2’ టైటిల్‌సాంగ్‌లోను స్టెప్పులేసింది.

 

 

ఈ ఇండో- కెనడా మోడల్‌ నోరా ఫతేహీ  ఎప్పుడూ సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటుంది. అప్పుడ‌ప్పుడు త‌న ప‌ర్‌ఫార్మెన్స్‌కి సంబంధించి కొన్ని వీడియోస్ షేర్ చేస్తూ అభిమానుల‌ని అల‌రిస్తుంటుంది. కొంతమంది భామల విషయంలో సినీ పరిశ్రమ చాలా అన్యాయం చేస్తుంది. వారు ఎంత అందంగా ఉన్నా.. అందాలను ఎంతందంగా తెరపై రసవత్తరంగా ఆరబోయడానికి సిద్దంగా ఉన్నా కూడా.. వారికి అవకాశాలు మాత్రం చాలా తక్కువగా వస్తుంటాయి. మొన్నామధ్యన స్విమ్మింగ్ పూల్ పక్కనే పింకు రంగు బికినీలో ఛముక్కులు కురిపించిన నోరా.. ‘నా ట్రైనింగ్ సెషన్ను నేను చాలా సీరియస్ గా తీసుకుంటాను’ అంటూ కామెంట్ చేసింది. ఇక ఈ అమ్మడి సోయగాలు మత్తెక్కిస్తున్నాయని నెటిజన్లు పిచ్చెక్కిపోతున్నారు.