పాపం.. ఆ హీరోయిన్ కి వాల్యూ లేదా..?

no value for heroine
Highlights

స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఓ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి సూపర్ సక్సెస్ ను తన ఖాతాలో వేసుకుంది ఆ హీరోయిన్. తెలుగులో కూడా ఎంట్రీ ఇచ్చింది. కానీ అనుకున్న స్థాయిలో ఆమెకు అవకాశాలు మాత్రం రాలేదు

సినిమా ఇండస్ట్రీలో క్రేజ్ ఉండి, డిమాండ్ ఉన్న వారికే ఎక్కువ రెమ్యునరేషన్ ఉంటుంది. లేదంటే ఎంతోకొంత చేతిలో పెట్టి సరిపెట్టేస్తారు. కాస్త గుర్తింపు ఉన్న తారలు సైతం పారితోషికం డిమాండ్ చేసే రోజులివి. కానీ ఓ హీరోయిన్ మాత్రం రెమ్యునరేషన్ అడగలేక తనలో తనే ఇబ్బంది పడుతుందని సమాచారం. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఓ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి సూపర్ సక్సెస్ ను తన ఖాతాలో వేసుకుంది ఆ హీరోయిన్.

తెలుగులో కూడా ఎంట్రీ ఇచ్చింది. కానీ అనుకున్న స్థాయిలో ఆమెకు అవకాశాలు మాత్రం రాలేదు. దీంతో అవార్డు ఫంక్షన్లు, స్టేజ్ షోలకు మాత్రమే పరిమితమైంది. రీసెంట్ గా ఆమెకు ఓ సినిమాలో నటించే ఛాన్స్ వచ్చింది. అయితే ఈమెతో పాటు సినిమాలో మరో హీరోయిన్ కూడా ఉంటుంది. ఆమెకు స్టార్ వాల్యూ ఉండడంతో దాదాపు కోటి రూపాయల రెమ్యునరేషన్ అందించారు. ఇక ఈ హీరోయిన్ కు మాత్రం రెమ్యునరేషన్ అందలేదని తెలుస్తోంది.

ప్రయాణ ఖర్చుల కోసం చేతిలో ఐదు లక్షలు పెట్టి ఊరుకున్నారట నిర్మాత. పైగా ఆ విషయాన్ని నలుగురికి చెప్పకొని గొప్పగా ఫీల్ అవుతున్నాడట. నిజానికి ఈ హీరోయిన్ ఫిలిం ఛాంబర్ లో తనకు రెమ్యునరేషన్ అందలేదంటూ సినిమా రిలీజ్ కు ముందు ఫిర్యాదు చేయొచ్చు. కానీ అలా చేస్తే అవకాశాలు రావేమోనని తనలో తనే బాధ పడుతుందని ఇసైడ్ వర్గాల సమాచారం. 

loader