నానితో సినిమా అయితే పక్కా.. కానీ సీక్వెల్ కాదు!

First Published 14, May 2018, 2:39 PM IST
no sequel for evade subramanyam movie says nag ashwin
Highlights

'ఎవడే సుబ్రమణ్యం' చిత్రంతో దర్శకుడిగా టాలీవుడ్ కు పరిచయమయిన నాగ్ అశ్విన్ తన రెండో 

'ఎవడే సుబ్రమణ్యం' చిత్రంతో దర్శకుడిగా టాలీవుడ్ కు పరిచయమయిన నాగ్ అశ్విన్ తన రెండో ప్రాజెక్ట్ 'మహానటి' తో టాప్ డైరెక్టర్ల జాబితాలోకి చేరిపోయాడనే చెప్పాలి. మెగాస్టార్ చిరంజీవి సైతం అశ్విన్ తో సినిమా చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. అయితే గత కొద్దిరోజులుగా నాగ్ అశ్విన్ తనకు గుర్తింపు తీసుకొచ్చిన 'ఎవడే సుబ్రమణ్యం' సినిమాకు సీక్వెల్ తెరకెక్కించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

ఓ సందర్భంలో హీరో నాని కూడా ఎవడే సుబ్రమణ్యంకు సీక్వెల్ చేస్తే బావుంటుందని అన్నారు. తాజాగా ఈ విషయంపై స్పందించిన దర్శకుడు నాగ్ అశ్విన్ ''ఎవడే సుబ్రమణ్యం సినిమాకు సీక్వెల్ చేయాలనే ఆలోచన నాకు ఇంత వరకు రాలేదు. నేను చెప్పాలనుకున్న విషయాన్ని ఆ సినిమాలోనే చెప్పేశాను. ఇక సీక్వెల్ లో చెప్పడానికి ఏం ఉండదు. కానీ నాని ఓ సినిమా చేసే ప్లాన్ అయితే ఉంది. అది ఎవడే సుబ్రమణ్యం సీక్వెల్ అయితే కాదు'' అని స్పష్టం చేశారు. అదన్నమాట మేటర్.. ఇక ఈ సినిమాకు సీక్వెల్ లేనట్లే..  

loader