కమల్ హాసన్ గతేడాది ఫిబ్రవరి 21న ‘మక్కల్ నీది మయ్యమ్’ అనే పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే. దక్షిణాదిలో ఆరు రాష్ట్రాలకు గుర్తుగా ఆరు చేతులతో పార్టీ జెండాను తయారుచేసిన ఆయన  ఈ ఎన్నికల్లో తమిళనాడులో 39  స్థానాల్లో తన పార్టీ తరుపున అభ్యర్థులను నిలబెట్టారు. రూలింగ్ పార్టీ  అన్నాడిఎంకే పార్టీని, బీజేపీని టార్గెట్ చేస్తూ క‌మ‌ల్‌హాస‌న్ ప్ర‌చారం చేశారు.

కానీ ఈ ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే.. కమల్ హాసన్ పార్టీ ‘మక్కల్ నీది మయ్యం’ ఒక్క స్థానంలో కూడా అసలు ప్రభావమే చూపించలేక పోయింది. ఇలా జరగటాన్ని  కమల్ హాసన్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ మధ్య కాలంలో ఆయన సినిమాలు భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్స్ అయ్యాయి. రాజకీయాల్లో ఆయన ఎంట్రీ కూడా అదే పరిస్దితి. దాంతో ఈ సారి కమల్ రాజకీయాలకు బై చెప్పి, సినిమాలపై పూర్తి దృష్టి పెడతారని  తమిళ సిని వర్గాలు అంటున్నాయి.  

రాబోయే ఎన్నికలు దాకా పార్టీని నడపటం అనేది అంత ఈజీ అయిన వ్యవహారం కాదని కమల్ తెలుసు అని పార్టీని క్లోజ్ చేసేస్తాడని అంటున్నారు. ఏదైమైనా ఎంతో ఆర్భాటంగా రాజకీయ రంగంలో ప్రవేశించిన కమల్ హాసన్‌కు ఈ ఫలితాల సరళి మింగుడు పడటం లేదు. ఎన్నికల సంఘం కమల్ పార్టీకి టార్చిలైట్ గుర్తును కేటాయించింది. ఆ టార్చిలైట్ కు వెలుగు లేకుండా పోయింది.