సీనియర్ నటుడు మోహన్ బాబు నటించిన తాజా చిత్రం 'సన్నాఫ్ ఇండియా'. కరోనా కారణంగా పలుమార్లు ఈ చిత్రం వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 18న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.
సీనియర్ నటుడు మోహన్ బాబు నటించిన తాజా చిత్రం 'సన్నాఫ్ ఇండియా'. కరోనా కారణంగా పలుమార్లు ఈ చిత్రం వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 18న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. మోహన్ బాబు తన సినిమా ప్రమోషన్స్ విషయంలో జాగ్రత్తగా ఉంటారు. కానీ త్వరలో రిలీజ్ ఉన్నప్పటికీ సన్నాఫ్ ఇండియా ప్రచార కార్యక్రమాలేవీ మొదలు కాలేదు.
అప్పుడెప్పుడో మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ తో ఓ టీజర్.. ఇళయరాజా సంగీతంలోని ఓ పాట విడుదలయ్యాయి. ప్రస్తుతం ఎలాంటి ప్రమోషనల్ స్టఫ్ కనిపించడం లేదు. ఈ చిత్రాన్ని స్వయంగా మంచు విష్ణు నిర్మించారు. అయినప్పటికీ ఈ మూవీపై మంచు ఫ్యామిలీ మౌనంగా ఎందుకు ఉండనే సందేహాలు కలుగుతున్నాయి.
అయితే ఈ చిత్రంపై ఒక ప్రచారం జరుగుతోంది. వరుసగా వాయిదా పడుతుండడం, పైగా కోవిడ్ పరిస్థితులు కొనసాగుతుండడంతో సినిమా భారీ చిత్రాల నడుమ సినిమాల విడుదల కష్టంగా మారుతోంది. దీనితో మంచి డీల్ కుదిరితే సన్నాఫ్ ఇండియా చిత్రాన్ని ఓటిటిలో రిలీజ్ చేయాలని మోహన్ బాబు భావించారట.
ఊహించని విధంగా ఈ చిత్రాన్ని దక్కించుకునేందుకు ఏ ఓటిటి సంస్థ కూడా ఆసక్తి చూపలేదని టాక్. బడ్జెట్ రికవరీ అయ్యేలా ఈ చిత్రాన్ని కొనేందుకు ఓటిటి సంస్థలేవి ఆసక్తి చూపలేదట. ఈ చిత్రానికి ఓటిటిలో అంత మార్కెట్ లేకపోవడం, సినిమాపై కనీస బజ్ లేకపోవడం కారణాలుగా చెబుతున్నారు. మరి ఈ ప్రచారం ఎంతవరకు నిజమో తెలియాలి.
అయితే ప్రమోషన్స్ విషయంలో మాత్రం మంచి ఫ్యామిలీ సైలెంట్ గా ఉందనేది వాస్తవం. ఫిబ్రవరి 18న సన్నాఫ్ ఇండియా చిత్రాన్ని థియేటర్స్ లో విడుదల చేస్తున్నారు. ఆశించిన స్థాయిలో వసూళ్లు దక్కాలంటే సన్నాఫ్ ఇండియాకి ప్రమోషన్స్ అవసరం.
