గ్లోబల్ బ్యూటీ ప్రియాంక.. హాలీవుడ్ సింగర్ నిక్ ని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి తరువాత ఈ జంట అమెరికాలోనే స్థిరపడింది. ఇది ఇలా ఉండగా.. ఈ జంట ఇకపై అడల్ట్ థీమ్ సినిమాలు కానీ, షోలు కానీ, టీవీ సిరీస్ లలో కానీ నటించకూడదని నిర్ణయించుకున్నారట.

ఈ విషయాన్ని ఓ హాలీవుడ్ న్యూస్ పేపర్ ప్రచురించింది. ఇది నిక్ తీసుకున్న నిర్ణయంగా పేర్కొన్నారు. పెళ్లి తరువాత తన భవిష్యత్తును, కుటుంబాన్ని, రేపటితరం తమ పిల్లలను ఉద్దేశించి నిక్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.

గతంలో ప్రియాంక కొన్ని హాట్ చిత్రాల్లో, టీవీ సిరీస్ లలో నటించింది. బోల్డ్ సన్నివేశాల్లో ఎలాంటి మొహమాటాలు పెట్టుకోకుండా నటించింది. కానీ ఇకపై అలాంటివేవీ ఉండవని చెబుతున్నాడు నిక్. ఇక తమ నుండి ఎలాంటి ఏ రేటెడ్ కంటెంట్ కూడా రాదని స్పష్టం చేశాడు.

మొత్తానికి ఈ జంట పెళ్లి తరువాత తమ పరిమితులు బాగానే పెట్టుకుంటున్నారు. కానీ చాలా మంది హీరోయిన్లు పెళ్లి తరువాత కూడా బోల్డ్ సన్నివేశాల్లో నటించడానికి ఎలాంటి అభ్యంతరాలు పెట్టుకోవడం లేదు. అటువంటి వారితో పోలిస్తే నిక్, ప్రియాంక ప్రత్యేకమనే చెప్పాలి.