Asianet News TeluguAsianet News Telugu

‘కేజీఎఫ్’ టీమ్ కు ఫేవర్ గా కోర్టు తీర్పు

సంజూ బాబా.. బాంబు పేళుడు కేసులో అరెస్ట్ అయ్యి జైలు శిక్ష కూడా అనుభవించాడు. అలాంటి వ్యక్తి కన్నడ సినిమాలో నటించేందుకు అనర్హుడు అంటూ ఒక వ్యక్తి కర్ణాటక హైకోర్టులో పిటీషన్ దాఖలు చేయడం జరిగింది. 

No Law Prohibits A Convict From Acting : Karnataka HC
Author
Hyderabad, First Published Aug 17, 2020, 7:33 PM IST

కొందరు చట్టాలను అడ్డం పెట్టుకుని పెద్ద సంస్ధలను ఇబ్బంది పెట్టేందుకు కోర్ట్ లు కేసులు వేస్తూంటారు. ఒక్కోసారి ఆ కేసు తెమెలేదాకా మిగతా పనుల్లో ముందుకు వెళ్లేందుకు ఉండదు. అలాంటిదే ఓ కేసు...కేజీఎఫ్ నిర్మాతలపై పడింది. ఆ కేసు...సంజయ్ దత్ ని ఉద్దేశిస్తూ వేసారు. సంజూ బాబా.. బాంబు పేళుడు కేసులో అరెస్ట్ అయ్యి జైలు శిక్ష కూడా అనుభవించాడు. అలాంటి వ్యక్తి కన్నడ సినిమాలో నటించేందుకు అనర్హుడు అంటూ ఒక వ్యక్తి కర్ణాటక హైకోర్టులో పిటీషన్ దాఖలు చేయడం జరిగింది. 

అయితే అనేక వాదోపవాదాలు, సుదీర్ఘ వాదనలు విన్న హై కోర్టు నేడు ఆ విషయమై తుది తీర్పు ఇవ్వడం జరిగింది. అరెస్ట్ అయినంత మాత్రాన జైలుకు వెళ్లినంత మాత్రాన సినిమాలో నటించేందుకు అనర్హుడు అంటూ మేము చెప్పలేం అంటూ కోర్టు పేర్కొంది. అలాగే జైలుకు వెళ్లిన వచ్చి సినిమాలో నటించకూడదు అంటూ చట్టంలో ఉందని పిటీషనర్ చూపించలేక పోయాడు. కనుక అతడు వేసిన పిటీషన్ ను కొట్టి వేస్తున్నట్లుగా కోర్టు పేర్కొంది. దాంతో కేజీఎఫ్ చిత్ర యూనిట్ సభ్యులకు లీగల్ టెన్షన్ తొలగిపోయింది. 

అయితే ప్రస్తుతం సంజయ్ దత్ క్యాన్సర్ తో పోరాడుతున్న నేపథ్యంలో ఆయన ఎప్పుడు షూటింగ్ కు వస్తారా అంటూ యూనిట్ సభ్యులు ఎదురు చూస్తున్నారు. ఆయన నెల రోజులు షూటింగ్ కు వస్తే షూటింగ్ మొత్తం పూర్తి అవుతుందని వినపడుతోంది.
 
కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం‘కేజీఎఫ్’. ఈ  చిత్రం ఐదు భాషల్లో విడుదలై ఘన విజయాన్ని సొంతం చేసుకుంది.  ప్రపంచవ్యాప్తంగా రూ 200 కోట్లు రాబట్టిన తొలి కన్నడ చిత్రంగా  కేజీఎఫ్‌ రికార్డు నెలకొల్పింది. ఈ సూపర్‌ హిట్‌ మూవీ ‘కె.జి.ఎఫ్‌’కి కొనసాగింపుగా రూపొందుతున్న ‘కె.జి.ఎఫ్‌ చాప్టర్‌–2’లో సంజయ్ దత్ విలన్‌ అధీరా పాత్రను పోషిస్తున్నారు. ఇప్పటికే సంజయ్‌ దత్‌ పుట్టినరోజు  సందర్భంగా అధీరా పోస్టర్‌ని విడుదల చేసింది చిత్ర టీమ్.
 
ఇక కేజీఫ్ విడుదలైన అన్ని భాషల్లో కేజీఎఫ్‌ మంచి కలెక్షన్స్  సాధించింది. షారుక్‌ ఖాన్‌ జీరో, రణ్‌వీర్‌ సింగ్‌ల సింబా సినిమాలను తట్టుకుని ఈ సినిమా హిందీ వెర్షన్‌ రూ 40 కోట్లు వసూలు చేయడం బాలీవుడ్ విశ్లేషకులను ఆశ్చర్యపరిచింది. దాంతో ఈ చిత్రం సెకండ్ పార్ట్ ని మరింత పెద్దదిగా చేయటానికి గానూ బాలీవుడ్ స్టార్స్  సీన్ లోకి తీసుకు వస్తున్నారు. 
 
కైకాల సత్యనారాయణ సమర్పణలో హోంబలే ఫిలింస్‌ నిర్మిస్తోన్న ఈ చిత్రాన్ని తెలుగులో వారాహి చలనచిత్రం ద్వారా నిర్మాత సాయి కొర్రపాటి విడుదల చేస్తారు. ఈ చిత్రానికి సంగీతం: రవి బస్రూర్, కెమెరా: భువన్‌ గౌడ.
 

Follow Us:
Download App:
  • android
  • ios