Asianet News TeluguAsianet News Telugu

షాక్: చిరుకు హీరోయిన్,రొమాంటిక్ ట్రాక్ పెట్టడం లేదు

ఈ సినిమాలో హీరోయిన్ ని పెట్టడం లేదట. రొమాంటిక్ ట్రాక్ ని కూడా ఇంక్లూడ్ చేయటం లేదని వినికిడి. అయితే చిరంజీవి ఎంతవరకూ ఒప్పుకుంటారో చూడాలి. ‘లూసిఫర్’ మలయాళంలో విడుదలై ఘన విజయం సాధించిన ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ వారు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏప్రిల్ 12న విడుదల చేసారు. అయితే సినిమా అనుకున్నంతగా ప్రేక్షకులను అకట్టుకోలేకపోయింది. 
 

No heroine for  Chiranjeevi in Lucifer remake jsp
Author
Hyderabad, First Published Nov 25, 2020, 2:53 PM IST

తెలుగు పరిశ్రమలో ఇప్పుడు చిరంజీవి చేయబోతున్న లూసిఫర్ రీమేక్ హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. మలయాళ లూసిఫర్ ని తెలుగులో రీమేక్ చెయ్యబోతున్న చిరుకి ఆ రీమేక్ ని పక్కాగా తెరకెక్కించే డైరెక్టర్  గత కొద్ది రోజులుగా అన్వేషించారు. ఎందుకంటే అది కాస్త కాంప్లికేటెడ్ సబ్జెక్టు. కమర్షియల్ గా చేయటం కోసం చేసే మార్పులు మొయిన్ స్కిప్టుని మింగేయకూడదు. ఆ విషయం లో చిరు చాలా క్లారిటీగా ఉన్నారు. అందుకే ముందు సాహో డైరెక్టర్ సుజిత్ ని అనుకుని తర్వాత ఆ రీమేక్ నుండి ఆయన్ని తప్పించి వినాయక్ ని రంగంలోకి దించితే.. ఆయన కూడా చిరు ని మెప్పించేలేక చేతులెత్తేశాడు.

 దానితో తమిళ సూపర్ హిట్ డైరెక్టర్ మోహన్ రాజా ఇప్పడు లూసిఫర్ రీమేక్ దర్శకుల లిస్ట్ లోకి తీసుకొచ్చారు.ఇప్పటికే లూసిఫర్ రీమేక్ స్క్రిప్ట్ పనులను కూడా స్టార్ట్ చేసాడట. లూసిఫర్ స్క్రిప్ట్ లో మార్పులతో ఇప్పటికే ఓ వెర్షన్ చిరుకు వినిపించారని సమాచారం. దాంతో దాదాపు  మోహన్ రాజన్ లూసిఫర్ దర్శకుడిగా ఫిక్స్ అయ్యారని సమాచారం. ఈ క్రమంలో ఈ రీమేక్ స్పెషలిస్ట్ తెలుగు వెర్షన్ కు గాను కొన్ని మార్పులు చేసారట. ముఖ్యంగా ఈ సినిమాలో హీరోయిన్ ని పెట్టడం లేదట. రొమాంటిక్ ట్రాక్ ని కూడా ఇంక్లూడ్ చేయటం లేదని వినికిడి. అయితే చిరంజీవి ఎంతవరకూ ఒప్పుకుంటారో చూడాలి. 
 

‘లూసిఫర్’ మలయాళంలో విడుదలై ఘన విజయం సాధించిన ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ వారు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏప్రిల్ 12న విడుదల చేసారు. అయితే సినిమా అనుకున్నంతగా ప్రేక్షకులను అకట్టుకోలేకపోయింది. 

చిత్రం కథేమిటంటే...  రాష్ట్ర ముఖ్యమంత్రి పి.కె.అర్ (సచిన్ ఖేడేకర్) హఠాత్తు మరణం తరువాత ఆయన వారసుడు ఎవరనే చర్చ మొదలు అవుతుంది. రాష్ట్రం అంతా  కాబోయే ముఖ్యమంత్రి ఎవరు ? అని చర్చించుకుంటున్న  నేపధ్యంలో ఈ సినిమా మొదలవుతుంది. అప్పుడు పి.కె.అర్ కి అత్యంత సన్నిహితుడు స్టీఫెన్ గట్టు పల్లి (మోహన్ లాల్)సీన్ లోకి వస్తారు.  పి.కె.అర్ కి తను ఇచ్చిన మాట ప్రకారం ఆయన  కుమార్తె ప్రియ (మంజు వారియర్)అండగా నిలబడి ఆమెను సమస్యల నుండి బయట పడేస్తాడు.

ఈ క్రమంలో ప్రియ రెండో భర్త బాబీ (వివేక్ ఒబెరాయ్) వల్ల స్టీఫెన్ కు రకరకాల సమస్యలు వస్తాయి.  అంతే కాదు కొంతమంది స్వార్ధపూరిత ఆలోచనల కారణంగా స్టీఫెన్ పై కొన్ని నిందలు పడతాయి.  ఈ క్రమంలో జరిగే కొన్ని నాటకీయ పరిణామాల మధ్యన  ప్రియ (మంజు వారియర్)ను సేవ్ చేయటం ప్రధానాంశంగా కథ నడుస్తుంది. అందుకోసం స్టీఫెన్ ఎలాంటి పరిస్ధితులను ఎదురుకున్నాడు? లాంటి విషయాలు చుట్టూ సినిమా తిరుగుతుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios