బాలనటుడిగా ఎన్నో సినిమాల్లో నటించిన తనీష్.. హీరోగా మారిన తరువాత పెద్దగా విజయాలను అందుకోలేకపోయాడు. హీరోగా కొన్ని సినిమాలు చేసి ఫేడవుట్ అయిపోయాడు. ఆ సమయంలో కృష్ణవంశీ 'నక్షత్రం' సినిమాలో విలన్ పాత్రలో నటించాడు. ఆ సినిమా కూడా అతడిని కాపాడలేకపోయింది.

ఇక అతడి పనైపోయిందనుకున్న సమయంలో బిగ్ బాస్ 2 లో ఛాన్స్ వచ్చింది. ఈ షో ఫైనల్స్ వరకు చేరుకొని కొందరి ఆదరణ దక్కించుకున్నాడు. హౌస్ లో ఉన్నంతకాలం కౌశల్ తో గొడవ పడుతూ వార్తల్లో నిలిచాడు. హౌస్ నుండి బయటకి వచ్చిన తరువాత తన క్రేజ్ ని క్యాష్ చేసుకొని తను నటించిన 'రంగు' సినిమాను విడుదల చేశాడు.

విజయవాడకి చెందిన రౌడీ షీటర్ లారా జీవిత కథతో ఈ సినిమాను రూపొందించారు. నిన్న విడుదలైన ఈ సినిమాకి మిశ్రమ స్పందన లభించింది. కథ బాగుందని ఒకసారి చూసే సహాయం చేయొచ్చనే టాక్ వచ్చింది. ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్ కి వెళ్లే వారిని ఈ సినిమా ఎంటర్టైన్ చేస్తుంది.

అయితే ఈ సినిమాకి కనీసపు వసూళ్లు కూడా రావడం లేదట. మరో నాలుగు రోజుల్లో రజినీకాంత్ సినిమా రిలీజ్ ఉంది కాబట్టి అప్పటికి ఈ సినిమాను ఉన్న థియేటర్లలో నుండి తీసేయడం ఖాయం. దీంతో ఈ హీరోకి నిరాశ తప్పడం లేదు. సినిమాకి ఏవరేజ్ టాక్ వచ్చినా కనీసపు వసూళ్లు లేకపోవడంతో నిర్మాతలు లబోదిబోమంటున్నారు.