మాతృకను డైరెక్ట్ చేసిన జీతూ జోసెఫే తెలుగు ‘దృశ్యం 2’కు కూడా దర్శకత్వం వహించారు. అనుకోకుండా చిక్కుకున్న ఓ హత్య కేసు నుంచి తన కుటుంబాన్ని, ముఖ్యంగా తన కూతురిని ఓ తండ్రి ఎలా రక్షించుకున్నాడు అనే కథాంశంతో రూపొందించిన రూపొందిన సినిమానే దృశ్యం-2. ‘దృశ్యం’ సినిమాకి సీక్వెల్‌గాతెరకెక్కుతున్న ఈ చిత్రంలో విక్టరీ వెంకటేశ్ జంటగా నటించారు.
‘దృశ్యం-2’ అనే టైటిల్‌తో రూపొందిన ఈ సీక్వెల్‌ని అదే టైటిల్‌తో తెలుగులో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తి అయింది. కానీ, కరోనా సెకండ్ వేవ్ కారణంగా సినిమా రిలీజ్ వాయిదాపడుతూ వచ్చింది. ఈలోగా వెంకటేష్ నటించిన ‘నారప్ప’ సినిమా ఓటీటీలో విడుదలై మంచి సక్సెస్ సాదించింది. ఇప్పుడు పరిస్థితులు యథా పరిస్థితికి రావడంతో.. ‘దృశ్యం-2’ సినిమాను కూడా విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు చిత్ర యూనిట్. అయితే సినిమాను ఓటీటీలో విడుదల చేస్తారా.. లేక థియేటర్‌లోనా అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. లేటెస్ట్ గా ఈ సినిమాకు సంబంధించి ఓ అప్‌డేట్ ఇస్తాననటంతో రిలీజ్ డేట్, అది ఓటీటీనా, థియోటరా అనే క్లారిటీతో వస్తుందనుకున్నారు. అయితే సురేష్ బాబు ఆలోచనలో పడటానికి కారణం ఉందని తెలిసింది.
ఈ 24న థియోటర్ లో భారీ గా రిలీజ్ అవుతున్న శేఖర్ కమ్ముల చిత్రం లవ్ స్టోరీ రిజల్ట్ ని బట్టి సురేష్ బాబు ఆ నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం. అంటే ఈ నెక్ట్స్ వీక్ లో దృశ్యం 2 రిలీజ్ విషయమై క్లారిటీ రానుంది. అంటే లవ్ స్టోరీ థియోటర్ లో జనం బాగా వచ్చి మంచి హిట్టైతే ‘దృశ్యం-2’ థియోటర్ లో రిలీజ్ చేస్తారు. లేదు అంటే ఓటీటికు వెళ్లిపోతారు. అలా లవ్ స్టోరీ రిజల్ట్ కోసం వెయిటింగ్ అన్నమాట. ఇక జీతు జోసెఫ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను సురేష్ బాబు, ఆంటోనీ పెరుంబవూర్, రాజ్ కుమార్ సేతుపతి సంయుక్తంగా నిర్మించారు.
మాతృకను డైరెక్ట్ చేసిన జీతూ జోసెఫే తెలుగు ‘దృశ్యం 2’కు కూడా దర్శకత్వం వహించారు. అనుకోకుండా చిక్కుకున్న ఓ హత్య కేసు నుంచి తన కుటుంబాన్ని, ముఖ్యంగా తన కూతురిని ఓ తండ్రి ఎలా రక్షించుకున్నాడు అనే కథాంశంతో రూపొందించిన రూపొందిన సినిమానే దృశ్యం-2. ‘దృశ్యం’ సినిమాకి సీక్వెల్‌గాతెరకెక్కుతున్న ఈ చిత్రంలో విక్టరీ వెంకటేశ్ జంటగా నటించారు. ''దృశ్యం 2'' సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తయినట్లు మేకర్స్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు వారు క్లీన్ 'యూ' (U) సర్టిఫికేట్ జారీ చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా పునఃప్రారంభం అంటూ 'దృశ్యం 2' టైటిల్ పోస్టర్ ని రిలీజ్ చేశారు.
కాగా 'దృశ్యం 2' చిత్రంలో ఒక థియేటర్ ఓనర్ అయిన కేబుల్ ఆరేటర్ రాంబాబు.. పోలీసులు తిరగదోడిన పాత కేసు వల్ల ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు?.. వాటి నుంచి తన తెలివితేటలతో ఎలా బయటపడ్డాడు? అనేది చూపించబోతున్నారు. ఈ చిత్రంలో వెంకటేష్ సరసన మీనా హీరోయిన్ గా కనిపించనుంది. ఇందులో ఎస్తర్ అనీల్ - కృతికా - సంపత్ నంది - పూర్ణ - నదియా - నరేష్ ఇతర పాత్రలు పోషించారు. సురేష్ ప్రొడక్షన్స్ - మాక్స్ మూవీస్ - రాజ్ కుమార్ థియేటర్స్ బ్యానర్స్ పై ఈ సినిమా రూపొందుతోంది. డి.సురేష్ బాబు - ఆంటోనీ పెరుంబవూర్ - రాజ్ కుమార్ సేతుపతి నిర్మాతలు. అనూప్ రూబెన్స్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి సతీష్ కురూప్ సినిమాటోగ్రఫీ అందించారు. మార్తాండ్ కె.వెంకటేష్ ఎడిటింగ్ వర్క్ చేశారు.
ఇక ఆ మధ్యన ‘దృశ్యం 2’ అయితే శాటిలైట్, డిజిటల్, డైరెక్ట్-ఓటీటీ కలిపి డిస్నీ+హాట్‌స్టార్ మొత్తం 36 కోట్ల రూపాయలకు సొంతం చేసుకుందని వార్తలు వచ్చాయి.అయితే నారప్ప, దృశ్యం 2 తో పాటు రానా ‘విరాట పర్వం’ కూడా నేరుగా ఓటీటీలోకి రానున్నట్లు చెప్పుకున్నారు. అయితే అది నిజం కాదని తేలింది. మలయాళ చిత్రం ‘దృశ్యం 2’ రీమేక్‌గా తెరకెక్కిన ఈ మూవీ కేవలం 30 రోజుల్లోనే షూటింగ్‌ను పూర్తి చేసుకుంది.
