ఈ సినిమాకు ఉన్నంతలో  శ్రీలీల హీరోయిన్ గా నటించడం  గ్లామర్‌ను మరింత పెంచింది.  దాంతో  ఈ సినిమాకి మంచి ఓపెనింగ్స్ రాబట్టడంలో శ్రీలీలకున్న పాపులారిటీనే ఉపయోగపడాలని భావిస్తున్నారు.  


వైష్ణవ్ తేజ్ హీరోగా రూపొందిన “ఆదికేశవ” రిలీజ్ కు ఎక్కువ రోజులు లేవు. దర్శకుడు,హీరో వరస పెట్టి వెబ్ మీడియాకు ఇంటర్వూలు ఇస్తున్నారు. అయినా సినిమాకి ఇప్పటివరకు హైప్ క్రియేట్ కాలేదు. మేకర్స్ ప్రమోషన్ చేస్తున్నారు కానీ సరైన బజ్ అందుకోవడం లేదు. అందుకు కారణం ట్రైలర్ రిలీజ్ కాకవటం ఓ కారణం కావచ్చు. రెండు రోజుల క్రితం ట్రైలర్ వస్తుందనుకుంటే టెక్నికల్ రీజన్స్ తో ఆగింది. దాంతో ఈ సినిమా ఎలా ఉంటుందనే ఐడియా రావటంలేదు..ఎక్సపెక్టేషన్స్ ఏర్పడటం లేదు. 

వైష్ణవ్‌కి ఈ సిట్యువేషన్ క్లియర్ గా తెలుసు, "ఆదికేశవ" తన ఉప్పెన రోజులను తీసుకువస్తుందని భావిస్తున్నాడు. వైష్ణవ్ తేజ్ గత సినిమాలు “కొండ పొలం”, “రంగ రంగ వైభవంగా” నిరాశపరిచాయి. వైష్ణవ్ తేజ్ కి మొదటి చిత్రం తప్ప మరో హిట్ లేదు. ఆయనకి క్రేజ్ కూడా లేదు. వైష్ణవ్ తేజ్ కోసం మెగా అభిమానులందరూ కలిసి మొదటి రోజు థియేటర్లకు రావటం లేదు. మెగా హీరోగా ముద్రపడలేదు. దాంతో ఓపినింగ్స్ రాకపోవటంతో అతని మార్కెట్ స్థితి అయోమయంగా తయారయ్యింది.

ఈ సినిమా తన గత వైభవాన్ని తిరిగి పొందడానికి కీలకమైన అవకాశంగా ఉపయోగపడుతుందని నమ్ముతున్నాడు. అలా జరగటంలో మాత్రం ఫెయిలైతే అతని ఫ్యూచర్ ప్రాజెక్ట్‌లకు ప్రమాదం ఏర్పడుతుంది. ఈ సినిమాకు ఉన్నంతలో శ్రీలీల హీరోయిన్ గా నటించడం గ్లామర్‌ను మరింత పెంచింది. దాంతో ఈ సినిమాకి మంచి ఓపెనింగ్స్ రాబట్టడంలో శ్రీలీలకున్న పాపులారిటీనే ఉపయోగపడాలని భావిస్తున్నారు. అవునన్నా కాదన్నా ఈ సినిమాకు శ్రీ లీలనే ఈ సినిమాకి మెయిన్ అట్రాక్షన్ మరి.

 ప‌క్కా మాస్ యాక్షన్‌ క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా వస్తోన్న ఈ చిత్రానికి శ్రీకాంత్ ఎన్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. ఆదికేశవ నుంచి మేకర్స్‌ ఇప్పటికే లాంఛ్ చేసిన టైటిల్, ఫస్ట్‌ గ్లింప్స్ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఆదికేశవలో పెళ్లి సంద‌D ఫేం శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుండగా..బీస్ట్‌ ఫేం అపర్ణా దాస్, జోజు జార్జ్‌ ఇదర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.ఈ మూవీని సితార ఎంట‌ర్‌టైన్ మెంట్స్ (Sithara Entertainments)-ఫార్చూన్ ఫోర్ సినిమా బ్యాన‌ర్లు సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. నాగ‌వంశి, సాయి సౌజ‌న్య నిర్మిస్తున్నారు. ఆదికేశవ రన్‌ టైం 2 గంటల 10 నిమిషాలు. రక్తికట్టించే స్క్రీన్‌ ప్లే, ఎంగేజింగ్ ఎక్స్‌పీరియన్స్ అందించేలా సినిమా ఉండబోతుందట.