విజయ్ దేవరకొండకి అంత సీన్ లేదా..?

https://static.asianetnews.com/images/authors/74ce1d03-f84b-5b8e-abc1-c43c5f7c8632.jpg
First Published 10, Sep 2018, 4:44 PM IST
no buyers for vijay devarakonda's nota movie
Highlights

మూడు చిత్రాలతో టాప్ హీరోల క్రేజ్ దక్కించుకున్నాడు విజయ్ దేవరకొండ. ఆయన నటించిన 'గీత గోవిందం' సినిమా రూ.100 కోట్ల మార్క్ ని టచ్ చేసి అందరికీ షాక్ ఇచ్చింది

మూడు చిత్రాలతో టాప్ హీరోల క్రేజ్ దక్కించుకున్నాడు విజయ్ దేవరకొండ. ఆయన నటించిన 'గీత గోవిందం' సినిమా రూ.100 కోట్ల మార్క్ ని టచ్ చేసి అందరికీ షాక్ ఇచ్చింది. యూత్ లో విజయ్ దేవరకొండకి ఉన్న క్రేజ్, బాక్సాఫీస్ వద్ద ఆయన సినిమాల జోరు చూసి చాలా మంది హీరోలు షాక్ అయ్యారు. విజయ్ క్రేజ్ ని ఇప్పుడు నిర్మాతలు క్యాష్ చేసుకునే పనిలో పడ్డారు. విజయ్ నెక్స్ట్ సినిమా ఎప్పుడొస్తుందా..? అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూసే రోజు వచ్చేశాయి.

దీంతో విజయ్ నటించిన సినిమా థియేట్రికల్ రైట్స్ కోసం ఎక్కువ మొత్తాన్ని డిమాండ్ చేస్తున్నారు నిర్మాతలు. కానీ బయ్యర్లు మాత్రం అంత పెట్టి తీసుకోవడానికి ఆలోచనలో పడుతున్నారు. ఆనంద్ శంకర్ డైరెక్ట్ చేసిన 'నోటా' అనే సినిమాలో నటించాడు విజయ్ దేవరకొండ. ఈ సినిమా అక్టోబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తెలుగు రైట్స్ మొత్తం రూ.30 కోట్లకు అమ్మాలనేది నిర్మాతల ప్లాన్.

నిజానికి సినిమాకి ఆ రేంజ్ లో ఖర్చు కూడా అవ్వలేదు. కానీ మార్కెట్ లో విజయ్ డిమాండ్ చూసి ఇంత మొత్తాన్ని బయ్యర్లకు చెప్పి షాక్ ఇస్తున్నారు. అయితే బయ్యర్లు మాత్రం రూ.20 కోట్లు మాత్రం సేఫ్ బిజినెస్ అని మహా అయితే మరో ఐదు కోట్లు రిస్క్ చేయొచ్చు కానీ రూ.30 కోట్లు అంటే చాలా ఎక్కువ అని అభిప్రాయం పడుతున్నారు. ఈ సినిమాలో తమిళ వాసన కాస్త ఎక్కువైందనే కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో రూ.30 కోట్లు పెట్టడానికి వెనుకడుగు వేస్తున్నారు.

వరుస విజయాలతో జోరు మీదున్నప్పటికీ విజయ్ దేవరకొండ సినిమాను అంత పెట్టి కొనడానికి మాత్రం బయ్యర్లు ఇంకా జంకుతూనే ఉన్నారు. 

loader