హీరోయిన్లు మెగా ఫోన్‌ పట్టి చేతులు సక్సెస్‌ అయిన సందర్భాలు చాలా తక్కువ. రేవతి, నందితా దాస్‌, అపర్నాసేన్‌, పూజా భట్‌ ఫర్వాలేదనిపించుకున్నారు. కానీ మహానటి సావిత్రి మెగాఫోన్‌ పట్టి తన కెరీర్‌నే నాశనం చేసుకున్నారు. కొంకణాసేన్‌ ఆకట్టుకోలేకపోయింది. బాలీవుడ్‌ హీరోయిన్‌ కంగనా రనౌత్‌ `మణికర్ణిక`తో మెగా ఫోన్‌ పెట్టి షాక్‌ తిన్నది. హేమా మాలిని,  ఇది గతం. కానీ తాము మాత్రం మెగా ఫోన్‌ పట్టి తమలోని మరో కోణాన్ని ఆవిష్కరిస్తామని చెబుతున్నారు నేటి తరం హీరోయిన్లు. 

మలయాళ భామ అనుపమా పరమేశ్వరన్‌ భవిష్యత్‌లో దర్శకత్వం వహించాలనే ఆలోచనని పంచుకున్న విషయం తెలిసిందే. కేవలం ఆలోచనతోనే కాదు ఓ తమిళ చిత్రానికి తాను అసిస్టెంట్‌ డైరెక్టర్‌గానూ పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరో హీరోయిన్‌ నివేదా థామస్‌ సైతం తనకు డైరెక్షన్‌ చేయాలనే ఆలోచన ఉన్నట్టు తెలిపింది. 

ఇటీవల సోషల్‌ మీడియాలో అభిమానులతో చాట్‌ చేసిన ఈ ఎన్టీఆర్‌ భామ తనకు భవిష్యత్‌లో దర్శకత్వం వహించాలనే ఆలోచన ఉందని తెలిపింది. ట్విట్టర్‌లో ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు ఇలా స్పందించింది. అంతేకాదు తనకు విభిన్నమైన, సవాల్‌తో కూడిన పాత్రలు పోషించడం ఇష్టమని తెలిపింది. ఎన్టీఆర్‌ హీరోగా త్రిపాత్రాభినయం చేసిన `జై లవకుశ`లో ఆయన సరసన నివేదా హీరోయిన్‌గా నటించిన విషయం తెలిసిందే. ఇక ఈ అమ్మడు నటించిన `వి` చిత్రం ఓటీటీలో విడుదల కాబోతుంది. 

ప్రస్తుతం నివేదా `వకీల్‌ సాబ్‌`,`శ్వాస`తోపాటు సుధీర్‌ వర్మ చిత్రంలో నటిస్తుంది. దీంతోపాటు ప్రభాస్‌, నాగ్‌ అశ్విన్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న సైన్స్ ఫిక్షన్‌ చిత్రంలో ఓ కీలక పాత్ర కోసం ఎంపికైంది. ఇందులో మెయిన్‌ హీరోయిన్‌గా దీపికా పదుకొనె ఎంపికైన విషయం తెలిసిందే.