ప్రభాస్ సినిమాల్లో నటించాలని ఎవరికి ఉండదు చెప్పండి. ఎందుకంటే ప్రభాస్ సినిమా అంటే భారీ బడ్జెట్.  భారీ బిజినెస్. పాన్ ఇండియా లెవిల్. ఫ్యాన్ ఫాలోయింగ్...ఒకటేమిటి ప్రభాస్ సినిమా చేస్తున్నామంటే అన్ని వైభోగాలు వచ్చి పడతాయి. అందుకే చిన్న పాత్రైనా ఫరవాలేదు ప్రభాస్ సినిమాలో వేషం కోరుకుంటారు సినిమా వాళ్లు. తాజాగా అలాంటి అవకాసం నివేదిత థామస్ కు వచ్చినట్లు సమాచారం. 

నాగ్ అశ్విన్, ప్రభాస్ కాంబినేషన్ లో రూపొందనున్న చిత్రంలో నివేదిత థామస్ కు ఓ ప్రత్యేకమైన పాత్ర దొరికిందని సమాచారం. సినిమాకు కీలకమైన పాత్ర అది అని చెప్తున్నారు. దాంతో మరో మాట లేకుండా నివేదిత ఓకే చేసిందని సమాచారం. అయితే రెమ్యునేషన్, డేట్స్ వంటి విషయాల్లో డిస్కషన్స్ జరుగుతున్నాయని, త్వరలోనే ఎగ్రిమెంట్ కుదురుతుందని చెప్తున్నారు. నివేదితకు చాలా తక్కువ మొత్తం ఆఫర్ చేసారని, డేట్స్ మాత్రం ఎక్కువ రోజులు అడుగుతున్నారని, దాంతో డైలమోలో పడిందని సమాచారం. అయితే అశ్వనీదత్ సంస్ద తొలి నుంచి గీచి,గీచి బేరం ఆడతారు. అయతే ఇస్తానని ఒప్పుకున్న మొత్తం చివరి పైసా తో సైతం చేతిలో పెడతారని పేరు.

నిన్ను కోరి చిత్రంతో పాపులరైన ఈ హీరోయిన్..రీసెంట్ గా రజనీకాంత్ సినిమా దర్బార్ లో ఆయన కుమార్తె గా కనిపించింది. అలాగే నాని,సుధీర్ బాబు కాంబినేషన్ లో రూపొందిన వి సినిమాలోనూ నివేదిత చేసింది. ఆ సినిమా త్వరలో ఓటీటిలో రిలీజ్ కానుంది. ఎన్టీఆర్ వంటి స్టార్స్ వంటి సరసన చేసిన నివేదిత గ్లామర్ షో కు మాత్రం దూరంగా ఉంటూ వస్తోంది. ప్రస్తుతం పవన్ సినిమా వకీల్ సాబ్ చేస్తోంది.