నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ చిత్రం ఇప్పటికి బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తూనే ఉంది. బాలకృష్ణ ద్విపాత్రాభినయంలో అదరగొట్టారు. దీనితో బాలయ్య, బోయపాటి కాంబినేషన్ లో హ్యాట్రిక్ విజయాలు నమోదయ్యాయి.

నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ చిత్రం ఇప్పటికి బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తూనే ఉంది. బాలకృష్ణ ద్విపాత్రాభినయంలో అదరగొట్టారు. దీనితో బాలయ్య, బోయపాటి కాంబినేషన్ లో హ్యాట్రిక్ విజయాలు నమోదయ్యాయి. అఖండ చిత్రం బాలకృష్ణ కెరీర్ లోనే హైయెస్ట్ గ్రాస్ వసూలు చేసిన చిత్రంగా రికార్డు సృష్టించింది. 

బాలయ్య ఫాన్స్ కి పూనకాలు తెప్పించేలా బోయపాటి మాస్ ఎలిమెంట్స్ ని పక్కాగా సెట్ చేశారు. దీనితో అఖండ చిత్రం భారీ విజయం సాధించింది. ఈ చిత్రంలో 'జై బాలయ్య' సాంగ్ ఫ్యాన్స్ స్టఫ్ అనే చెప్పాలి. థియేటర్స్ లోనే ఫ్యాన్స్ ఈ సాంగ్ కి చిందులేశారు. ఫ్యాన్స్ బాగా ఎంజాయ్ చేసిన సాంగ్ ఇది. ఈ చిత్రానికి తమన్ అదిరిపోయే సాంగ్స్, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అందించారు. 

జై బాలయ్య సాంగ్ లో బాలకృష్ణ షర్ట్స్ విప్పుతూ వేసిన డ్యాన్స్ బాగా పాపులర్ అయింది. క్రేజీ బ్యూటీ నివేదా థామస్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. తరచుగా ఆమె తన విశేషాలని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ ఉంటుంది. తాజాగా నివేదా 'జై బాలయ్య' సాంగ్ కి బాలయ్య తరహాలో డ్యాన్స్ చేయాలని ట్రై చేసింది. 

View post on Instagram

షర్ట్స్ విప్పుతూ డ్యాన్స్ ట్రై చేసింది. కానీ ఆమె ప్రయత్నం బెడిసికొట్టింది. మొదటి షర్ట్ బాగానే ఓపెన్ అయింది. కానీ ఆ తర్వాత షర్ట్స్ సరిగ్గా రాలేదు. దీనితో నివేదానే నవ్వేసింది. ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తోంది. నెటిజన్లు వెరీ ఫన్నీ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. 

అఖండ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. శ్రీకాంత్ విలన్ పాత్రలో నటించాడు. ఈ ఏడాది నివేతా థామస్ వకీల్ సాబ్ చిత్రంతో మంచి విజయం ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం ఆమె శాకినీ ఢాకిని అని మూవీలో నటిస్తోంది. 

Also Read: Divi Photos: మాటల్లేవు ముద్దులే అంటున్న ఫ్యాన్స్.. కుర్రాళ్ల మతులు పోగొడుతూ విరహ వేదనతో దివి