తమిళంలో పలు చిత్రాల్లో నటించి గుర్తింపు సొంతం చేసుకున్న నివేథా పేతురాజ్ ప్రస్తుతం టాలీవుడ్ లో కూడా పాగా వేసేందుకు సిద్ధం అవుతోంది. ఇటీవల విడుదలైన సాయిధరమ్ తేజ్ చిత్రం చిత్రలహరిలో నివేథా పేతురాజ్ హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. ఆ చిత్రం మంచి విజయం సాధించింది. నివేథా పేతురాజ్ కు అందంతో పాటు మంచి నటిగా పేరుంది. 

తాజాగా నివేథాని ఓ మంచి అవకాశం వెతుక్కుంటూ వచ్చినట్లు తెలుస్తోంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో మెయిన్ హీరోయిన్ గా పూజా హెగ్డే ఇప్పటికే అవాకాశం దక్కించుకుంది. సెకండ్ హీరోయిన్ కు కూడా ఛాన్స్ ఉందట. చాలా రోజులుగా ఆ పాత్రకు సరిపడే నటి కోసం వెతుకుతున్నారు. 

సెకండ్ హీరోయిన్ ఛాన్స్ నివేథా పేతురాజ్ ని వరించినట్లు తెలుస్తోంది. త్వరలో నివేథా షూటింగ్ లో కూడా జాయిన్ కాబోతోందట. ఇటీవలే ఈ చిత్ర సెకండ్ షెడ్యూల్ షూటింగ్ ప్రారంభమైంది.