కోలీవుడ్ ముద్దగుమ్మల లాక్కేమిటో గాని ఒక్క సినిమాతో క్లిక్కయినా వెంటనే టాలీవుడ్ ని ఎట్రాక్ట్ చేస్తారు. బాలీవుడ్ కంటే ముందు వారి ద్రుష్టి ఎప్పుడు టాలీవుడ్ అవకాశాలపైనే ఉంటుంది. చిన్న అఫర్ వచ్చినా మిస్ చేసుకోరు. టాలీవుడ్ లో క్లిక్కయితే ఎక్కడైనా అవకాశాలు వస్తాయనే నమ్మకం వారికి బాగా పెరిగిపోయింది. 

ప్రస్తుతం నివేతా పేతురేజ్ తన టాలెంట్ తో వరుస అవకాశాలను అందుకుంటోంది. బేబీకి టాలీవుడ్ లో ఇప్పుడు మంచి డిమాండ్ ఏర్పడింది. చిత్ర లహరి - బ్రోచేవారెవరురా వంటి సినిమాల్లో నటించి పాజిటివ్ టాక్ అందుకున్న బేబీ నెక్స్ట్ రామ్ తో జోడి కట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అల్లు అర్జున్ కి సంబందించిన రెండు సినిమాల్లో అవకాశాలని అనుకున్నట్లు టాక్ వస్తోంది. 

త్రివిక్రమ్ - బన్నీ కాంబోలో వస్తోన్న సినిమాతో పాటు ఐకాన్ లో కూడా నీవేథా హీరోయిన్ గా నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పుడు కిషోర్ తిరుమల డైరెక్షన్ లో రామ్ నటించనున్న సినిమాలో మెయిన్ లీడ్ లో ఛాన్స్ కొట్టేసినట్లు సమాచారం. చిత్రలహరి సినిమాలో  నీవేథా పేతురేజ్ యాక్టింగ్ కి ఫిదా అయిన దర్శకుడు రామ్ సినిమాలో అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది.