గత కొద్ది రోజులుగా నిత్యామీనన్ పై నిర్మాతలు ఫైర్ అవుతున్నారు. ఆమెపై నిషేధం పెట్టాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఆమె పద్దతి నచ్చటం లేదని ఫిల్మ్ ఛాంబర్ లో కంప్లైంట్ చేసారు.  ప్ర‌స్తుతం నిత్యామీన‌న్ మ‌ల‌యాళం స‌హా త‌మిళ సినిమాలు చేస్తోంది. అయితే గత కొద్ది రోజులుగా  ఈ సినిమాల షూటింగ్ కు నిత్యామీనన్ అటెండ్ అవటం లేదు‌.  ముందుస్దు సమాచారం లేకుండా షూటింగ్ లకు ఆమె గైహ్జారు కావటంతో చాలా నష్టం వస్తోంది.

దాంతో  నిర్మాత‌ల‌ు ఆమెపై బ్యాన్ పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు‌. గ‌త నెల రోజులుగా ఇదే పద్దతి న‌డుస్తుంది. తాము  పోన్ చేస్తే ఎత్తటం లేదని, మాట్లాడటానికి ముందస్తు అపాయింట్ కావాలంటోందంటోందని అంటున్నారు. ఈ నేపధ్యంలో ఫిల్మ్ ఛాంబర్ లో చర్చ జరిగింది. ఈ విషయం మొత్తానికి నిత్యామీనన్ దృష్టికి వచ్చింది. అప్పుడు అసలు విషయం రివీల్ చేసింది. కేవలం త‌న త‌ల్లికి క్యాన్స‌ర్ కార‌ణంగానే షూటింగ్ ల‌కు హాజ‌రు కాలేక‌పోతున్నానని చెప్పింది.

తాను సినిమా షూటింగ్ లో ఉండగా ఇలా తన తల్లికి కాన్సర్ థర్డ్ స్టేజిలో ఉందని తెలిసిందని, దాంతో ఆమెను ఓదార్చటం, తనను తాను సమాధాన పడటం కాస్త కష్టంగా అయ్యిపోతోందని అంది. తాను ఆ బాధతో ఏడుస్తూంటే మైగ్రైన్ పెయిన్ వస్తోందని, దాంతో తాను స‌మాచారం కూడా ఇచ్చే ప‌రిస్థితుల్లో లేన‌ని వివ‌ర‌ణ ఇచ్చే ప్ర‌య‌త్నం చేసింది. దయ ఉంచి, త‌న త‌ల్లి ఆరోగ్యం కుదిటిప‌డేవ‌ర‌కూ త‌న‌పై ఒత్తిడి తీసుకోరావొద్ద‌ని మొర పెట్టుకుంటోంది‌. ఈ విషయమై నిర్మాతలు ఎలా స్పందింస్తారో తెలియాల్సి ఉంది.