శర్వానంద్ మూవీలోంచి తప్పుకుని సడెన్ గా షాకిచ్చిన నిత్యామీనన్

First Published 6, Dec 2017, 7:17 PM IST
nitya menon opted out of sharwanand movie
Highlights
  • తెలుగులో సినిమాలు చాలా వరకు తగ్గించిన నిత్య మీనన్
  • తాజాగా నాని నిర్మిస్తున్న ఆ సినిమాలో నటిస్తున్న నిత్యా మీనన్
  • శర్వానంద్ సినిమాలో అధికారికంగా ప్రకటించినా తాజాగా తప్పుకున్నట్లు టాక్

తెలుగు ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్ వున్న హిరోయిన్ నిత్యా మీనన్. తనకు నచ్చితేగానీ సినిమాకు ఓకే చెప్పదు. సరైన కథలు రాకపోవడం వలనే తెలుగులో ఎక్కువగా నటించడం లేదని గతంలో చెప్పుకొచ్చింది. తాజాగా నాని నిర్మిస్తోన్న ‘అ!’ సినిమాలో నటించడానికి అంగీకరించింది. ఈ సినిమా ఫస్ట్‌ లుక్ కూడా ఇటీవల విడుదలైంది.

 

దీంతోపాటు శర్వానంద్ హీరోగా సుధీర్ వర్మ దర్శకత్వంలో రాబోతున్న సినిమా కూడా నిత్యామీనన్ ఓకే చేసింది. సినిమా ఓపెనింగ్ రోజు చిత్రబృందం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. కానీ ఇప్పుడు ఉన్నట్టుండి నిత్య ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుందనే వార్తలు వినిపిస్తున్నాయి.

 

క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి వెళ్లిపోయిందని అంటున్నారు. సినిమాలో తనతో పాటు ఉన్న మరో హీరోయిన్ కాజల్ పాత్రకు ఎక్కువ ప్రాముఖ్యత ఉండడంతో నిత్య ఈ నిర్ణయం తీసుకుందని ఫిల్మ్ నగర్ టాక్. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నాగ వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల రామానాయుడు స్టూడియోస్‌లో సినిమా షూటింగ్‌ను ప్రారంభించారు. ఇప్పుడు రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యే సమయంలో నిత్య తప్పుకుందనే వార్త హాట్ టాపిక్ గా మారింది.

loader