సినీ వరల్డ్ లో ఒక ఏడాదిలో హీరోలకంటే హీరోయిన్సే ఎక్కువగా పరిచయమవుతుంటారు. ఈ విషయం అందరికి తెలిసిందే. నటనతో కాకుండా అందంతో అవకాశాలు అందుకునే ముద్దుగుమ్మలు ఎక్కువ కాలం ఉండలేరు. అయితే నిత్యమీనన్ లాంటి ముద్దుగుమ్మలు డిఫరెంట్ రోల్స్ తో వారికంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంటారు. 

జయాపజయాలతో సంబంధం లేకుండా ఈ బేబీ గత కొంత కాలంగా ఒకే లెవెల్లో కొనసాగవుతోంది. పెద్ద సినిమాలు చిన్న సినిమాలు అని తేడా లేకుండా తనకు నచ్చిన పాత్రలను చేసుకుంటూ వెళుతోంది. ఇకపోతే గత కొంత కాలంగా నిత్య కొంచెం లావుగా కనిపిస్తుండడం ఓ వర్గం అభిమానులను ఇబ్బంది పెడుతోంది. అయితే నిత్య మాత్రం తనకు నచ్చినట్టుగా ఉంటాను అన్నట్లు చాలా సార్లు నెగిటివ్ కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చింది. 

ఇకపోతే రీసెంట్ గా ఈ బ్యూటీ సన్నబడలని ఫిక్స్ అయ్యింది. బాలీవుడ్ లో మిషన్ మంగళ్ అనే సినిమాలో అవకాశం అందుకున్న నిత్య సినిమా కోసం జిమ్ లో తెగ కష్టపడుతుందట. ఎందుకంటే నార్త్ జనాలు కాస్త లావుగా కనిపించినా తట్టుకోలేరు. అందుకే బాలీవుడ్ నటీమణులు సైజ్ జీరో కోసం తెగ కష్టపడుతుంటారు. గెస్ట్ రోల్ అయినా సైడ్ క్యారెక్టర్ అయినా హిందీ స్క్రీన్ పై సన్నగా మెరవాల్సిందే. 

మరి ఆ విషయం గురించి అమ్మడు బాగా ఆలోచించినట్టుంది. అందుకే వెయిట్ లాస్ టిప్స్ తీసుకుంటోంది. రీసెంట్ గా సావిత్రి పాత్ర కోసం ఎన్టీఆర్ టీమ్ తో కలిసిన సంగతి తెలిసిందే. బాలకృష్ణతో ఉన్న ఒక పోస్టర్ ని రిలీజ్ చేయగా సావిత్రిగా నిత్యా తప్పకుండా ఆకట్టుకుంటుందని నెటిజన్స్ ప్రశంసలు కురిపించారు.