Asianet News TeluguAsianet News Telugu

నితిన్ కు కెమెరా ముందు నర్వస్ గా అనిపించిందట

  • హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో నితిన్
  • షూటింగ్ లో పాల్గొన్న హీరో నితిన్
  • ఎనిమిది నెలల తర్వాత కావటంతో నర్వస్ గా అనిపించిందన్న నితిన్
nitin started shooting for hanu raghavapudi

అఆ తర్వాత నితినే గత కొంత కాలంగా షూటింగ్ లో పాల్గొనలేదు. త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా ఓపెనింగ్ అయిపోయినా... షూటింగ్ ఇంకా ప్రారంభం కాలేదు. మరోవైపు హను రాఘవపూడి దర్శకత్వంలోనూ నితిన్ ఓ మూవీలో నటిస్తున్నాడు. దాదాపు ఎనిమిది నెలల తర్వాత ఈ మూవీ షూటింగ్ లో పాల్గొన్నాడు నితిన్. ఇలా గ్యాప్ తర్వాత షూటింగ్.. ఎప్పటిలాగే కొంత నర్వస్ అనిపించిందని నితిన్ ట్వీట్ చేశాడు.

 

‘అ..ఆ..’ లాంటి మంచి విజయం తర్వాత ఆ స్థాయికి తగ్గ సినిమాయే చేయాలన్న ఆలోచనతో నితిన్, ‘అందాల రాక్షసి’, ‘కృష్ణగాడి వీరప్రేమ గాథ’ లాంటి సినిమాలతో దర్శకుడిగా తనదైన మార్క్ సృష్టించుకున్న హను రాఘవపూడితో... ఆ స్థాయికి తగ్గ సినిమాయే చేయాలన్న ఆలోచనతో ఓ రొమాంటిక్ కామెడీ కోసం జత కట్టారు. ఇక ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలన్నింటినీ దాదాపుగా పూర్తి చేసుకున్న ఈ సినిమా నేడు హైద్రాబాద్‌లో షూటింగ్ మొదలుపెట్టింది.

 

దాదాపు 8 నెలల తర్వాత కెమెరా ముందుకొచ్చానని తెలుపుతూ నితిన్, తన కొత్త సినిమా మొదలైన విషయాన్ని తెలిపారు. హైద్రాబాద్‌లో ఒక షెడ్యూల్ ముగిసిన తర్వాత యూఎస్‌లో రెండు నెలల పాటు ఓ భారీ షెడ్యూల్ జరగనుందట. వేగాస్, సాన్‌ఫ్రాన్సిస్కో, చికాగోల్లోని కథకు అవసరమైన పలు అందమైన లొకేషన్స్‌లో షూటింగ్ జరగనుందని సమాచారం. ఫిబ్రవరి నెలలో యూఎస్ షెడ్యూల్ మొదలవుతుంది. మే కల్లా షూటింగ్ మొత్తం పూర్తవుతుందని తెలుస్తోంది. 14 రీల్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఇక ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలన్నింటినీ దాదాపుగా పూర్తి చేసుకున్న ఈ సినిమా నేడు హైద్రాబాద్‌లో షూటింగ్ మొదలుపెట్టింది.

 

దాదాపు 8 నెలల తర్వాత కెమెరా ముందుకొచ్చానని తెలుపుతూ నితిన్, తన కొత్త సినిమా మొదలైన విషయాన్ని తెలిపారు. హైద్రాబాద్‌లో ఒక షెడ్యూల్ ముగిసిన తర్వాత యూఎస్‌లో రెండు నెలల పాటు ఓ భారీ షెడ్యూల్ జరగనుందట. వేగాస్, సాన్‌ఫ్రాన్సిస్కో, చికాగోల్లోని కథకు అవసరమైన పలు అందమైన లొకేషన్స్‌లో షూటింగ్ జరగనుందని సమాచారం. ఫిబ్రవరి నెలలో యూఎస్ షెడ్యూల్ మొదలవుతుంది. మే కల్లా షూటింగ్ మొత్తం పూర్తవుతుందని తెలుస్తోంది. 14 రీల్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది.

Follow Us:
Download App:
  • android
  • ios