- Home
- Entertainment
- Kaaka: మరోసారి ఆటో జానీ అవతారంలో మెగాస్టార్.. కాకాతో సంక్రాంతి బరిలో చిరంజీవి విధ్వంసం
Kaaka: మరోసారి ఆటో జానీ అవతారంలో మెగాస్టార్.. కాకాతో సంక్రాంతి బరిలో చిరంజీవి విధ్వంసం
Kaaka: మెగా అభిమానులకు గుడ్ న్యూస్.. మెగాస్టార మరోసారి ఆటో జానీ అవతారంలో అలరించబోతున్నాడు. గతంలో ఈ క్యారెక్టర్ ను థియేటర్ లో చూడలేని వారు.. అప్పట్లో చూసి ఎంజాయ్ చేసిన వారు కూడా పండగ చేసుకోబోతున్నారు.

చిరంజీవి అభిమానులకు పండగే..
మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు పండగ లాంటి వార్త అందింది. మెగాస్టార్ మరోసారి ‘ఆటో జానీ’ అవతారం ఎత్తబోతున్నారు అదీ సరికొత్త కోణంతో, మరింత మాస్ హంగులతో ‘కాకా’ చిత్రంలో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. బ్లాక్‌బస్టర్ దర్శకుడు బాబీ (కె.ఎస్. రవీంద్ర) దర్శకత్వంలో రూపొందుతున్న పవర్ ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘కాకా’ విడుదల తేదీపై గత కొద్ది రోజులుగా నెలకొన్న సందేహాలకు చిరంజీవి స్వయంగా తెరదించారు. వాయిదా పడుతుందంటూ సోషల్ మీడియాలో వచ్చిన వదంతులను కొట్టిపారేస్తూ, 2027 సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
సోషల్ మీడియాలో చిరంజీవి పోస్ట్
కాకా విడుదల తేదీని ఖరారు చేస్తూ చిరంజీవి తన సోషల్ మీడియా ఖాతాలో పెట్టిన పోస్ట్ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. “ఆటో జానీ గుర్తున్నాడా? ఈ సంక్రాంతికి సరికొత్తగా ‘కాకా’లో మీ ముందుకు వస్తున్నాడు! ఈ సంక్రాంతికి ‘ఆటో జానీ’లోని ఒక సరికొత్త కోణంతో మిమ్మల్ని అలరించడానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను” అంటూ అభిమానుల్లో జోష్ నింపారు. సినిమాను మరపురాని థియేట్రికల్ అనుభవంగా తీర్చిదిద్దేందుకు దర్శకుడు బాబీ తో పాటు మూవీ టీమ్ ప్రాణం పెట్టి పనిచేస్తున్నారని పేర్కొంటూ, జనవరి 13, 2027న థియేటర్లలో కలుద్దామని తెలిపారు.
ఆటో జానీ గుర్తున్నాడా? 😉
ఈ సంక్రాంతికి సరికొత్తగా #KAAKA లో మీ ముందుకు వస్తున్నాడు!
Looking forward to entertaining you all this Sankranthi with a whole new side of ‘Auto Johnny’.
@dirbobby and the entire team are putting their heart and soul into making #KAAKA a memorable theatrical experience.
See you all in theatres worldwide on January 13, 2027. ❤️
సంక్రాంతికి కలుద్దాం🤗
#AutoJohnnyIsBack @KvnProductions
#KAAKAOnJan13
— Chiranjeevi Konidela (@KChiruTweets) November 29, 2026
ఆటో జానీ పేరుతో ఫ్యాన్స్‌కు పూనకాలు
గతంలో 1991 లో వచ్చిన ‘రౌడీ అల్లుడు’ చిత్రంలో చిరంజీవి పోషించిన ‘ఆటో జానీ’ పాత్ర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అప్పట్లో చిరంజీవి అభిమానులకు పూనకాలు తెప్పించిన ఈ పాత్ర.. ఇప్పుడు ఈ జనరేషన్ లో మెగా ఫ్యాన్స్ కు కూడా పూనకాలు తెప్పించడానికి రెడీ అవుతోంది. ఈ పేరుతో పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో ఒక ప్రాజెక్ట్ ప్రకటించబడినా, అది పట్టాలెక్కలేదు. ఇప్పుడు అదే పవర్‌ఫుల్ పేరును, పాత్ర ఛాయలను దర్శకుడు బాబీ ‘కాకా’ కోసం సరికొత్తగా, హై-వోల్టేజ్ మాస్ అప్పీల్‌తో డిజైన్ చేయడం అభిమానుల్లో పూనకాలు రేపుతోంది.
వాల్తేరు వీరయ్య తర్వాత క్రేజీ కాంబినేషన్
‘వాల్తేరు వీరయ్య’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత చిరంజీవి, బాబీ కాంబినేషన్‌లో వస్తున్న రెండో సినిమా కావడంతో ‘కాకా’పై తొలి నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. కేవీఎన్ ప్రొడక్షన్స్ (KVN Productions) అత్యంత భారీ బడ్జెట్‌తో, అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఎస్.ఎస్. తమన్ సంగీతం అందిస్తుండగా, అనస్వర రాజన్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 2026 సంక్రాంతికి ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రంతో ఘన విజయాన్ని అందుకున్న చిరంజీవి, వరుసగా 2027 సంక్రాంతి బరిలోనూ ‘కాకా’తో దిగుతుండటంతో బాక్సాఫీస్ వద్ద మరోసారి మెగా విధ్వంసం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.











