మలయాళీ ముద్దుగుమ్మ నిత్యామీనన్ హీరోయిన్ అంటే సన్నజాజిలా, ఒంపు సొంపులతో ఉండాలనే రూల్ ని బ్రేక్ చేసి టాలెంట్ ఉంటే హీరోయిన్ గా రాణించొచ్చని నిరూపించింది. అయితే ఇది సినిమా ఇండస్ట్రీ కాబట్టి ఆమె బాడీ షేప్ పై కామెంట్స్ వినిపిస్తూనే ఉంటున్నాయి.

పొట్టిగా, లావుగా ఉందని నిత్యను విమర్శించే వారెందరో.. ఇదే విషయంపై ఓ జర్నలిస్ట్ ఆమెను ప్రశ్నించగా.. అలాంటి విషయాలను తాను పెద్దగా పట్టించుకోనని చెబుతోంది నిత్యామీనన్.

''పొట్టిగా, బొద్దుగా ఉన్నానని నేనేం బాధపడను. ఆత్మవిశ్వాసం గల అమ్మాయిని. నేనేంటో, నా లైఫ్ ఏంటో నాకు క్లారిటీ ఉంది. నన్ను విమర్శించే వాళ్లను చూస్తే నవ్వొస్తోంది. ఏ పనీ పాటా లేని వాళ్లే ఇలాంటి కామెంట్స్ చేస్తారు. పనున్న వారెవరూ పనిగట్టుకొని ఎదుటి వారి జీవితాల్లోకి తొంగిచూడరు'' అంటూ కొట్టినట్లు సమాధానం చెప్పింది. అంతేకాదు లావు, సన్నబడటం లాంటివి తనకు సంబంధించి చాలా చిన్న విషయాలని పాత్ర డిమాండ్ చేస్తే.. నెల రోజుల్లో సన్నబడతాను అంటూ చెప్పుకొచ్చింది.