పవన్ సరసన నిత్యా మీనన్.. సాయిపల్లవి నో చెప్పడానికి కారణమేంటి?
రానా సరసన ఐశ్వర్యా రాజేష్ పేరు వినిపించింది. దాదాపు కన్ఫమ్ అని తెలుస్తుంది. కానీ పవన్ సరసన ఎవరు నటిస్తారనేది సస్పెన్స్ నెలకొంది. ఇప్పటికే చాలా పేర్లు వినిపించాయి.
ఇటీవల రీఎంట్రీ ఇస్తూ `వకీల్‌సాబ్` చిత్రంతో భారీ బ్లాక్ బస్టర్ అందుకున్నారు పవన్ కళ్యాణ్. ఇప్పుడు అదే ఊపులో వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. అదే సమయంలో కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్స్ ఇస్తున్నారు. ప్రస్తుతం ఆయన మలయాళ సూపర్ హిట్ `అయ్యప్పనుమ్ కోషియుమ్` చిత్రంలో నటిస్తున్నారు. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తుండగా, త్రివిక్రమ్ దీనికి మాటలు, స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. కరోనా నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది. ఇందులో రానా మరో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే.
ఇక ఇందులో హీరోయిన్లు ఎవరనేది దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. రానా సరసన ఐశ్వర్యా రాజేష్ పేరు వినిపించింది. దాదాపు కన్ఫమ్ అని తెలుస్తుంది. కానీ పవన్ సరసన ఎవరు నటిస్తారనేది సస్పెన్స్ నెలకొంది. ఇప్పటికే చాలా పేర్లు వినిపించాయి. రకుల్ ప్రీత్ సింగ్ పేరు వినిపించింది. ఆ తర్వాత సాయిపల్లవిని సంప్రదించారట. అయితే ఆమె నో చెప్పడంతో ఇప్పుడు నిత్యా మీనన్‌ని సంప్రదించినట్టు తెలుస్తుంది. నిత్యా దాదాపు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని టాక్. ఇప్పటికే ఆమె ఓకే అయ్యిందని, త్వరలోనే ఆమె షూటింగ్‌లో పాల్గొంటుందని సమాచారం.
ఇదిలా ఉంటే ఉంటే సాయిపల్లవి నో చెప్పడానికి కారణమేంటనేది ఆసక్తికరంగా మారింది. పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోతో సినిమా అంటే చాలా వరకు హీరోయిన్లు నటించేందుకు ఆసక్తి చూపుతారు. మరీ సాయిపల్లవి ఎందుకు నో చెప్పిందనేది చూస్తే.. జనరల్‌గా పవన్ కళ్యాణ్ సినిమాల్లో హీరోయిన్‌కి పెద్దగా ప్రాధాన్యత ఉండదు. పైగా ఇద్దరు వ్యక్తుల(హీరోల) మధ్య క్లాష్ ప్రధానంగా సాగే ఈ చిత్రంలో హీరోయిన్లకి అంతగా ప్రయారిటీ ఉండదు. అందుకే సాయిపల్లవి నో చెప్పిందని టాక్. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. ఈ సినిమాని సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.