యంగ్ హీరో నితిన్ వరుస చిత్రాలతో బిజీ అవుతున్నాడు. నితిన్ నటిస్తున్న తాజా చిత్రం భీష్మ. ఛలో ఫేమ్ వెంకీ కుడుముల ఈ చిత్రానికి దర్శకుడు. రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది. అ..ఆ తర్వాత నితిన్ కు సరైన హిట్ పడలేదు. మంచి విజయం కోసం నితిన్ ఎదురుచూస్తున్నాడు. 

భీష్మ చిత్రం రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోంది. తాజాగా ఈ చిత్ర తొలి షెడ్యూల్ పూర్తయింది. దాదాపు 25 రోజులపాటు సాగిన ఫస్ట్ షెడ్యూల్ లో దర్శకుడు వెంకీ కుడుముల హీరో, హీరోయిన్లపై కీలక సన్నివేశాలు చిత్రీకరించాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగవంశీ, పిడిపి ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

ఆగష్టు 16 నుంచి రెండవ షెడ్యూల్ ప్రారంభం అవుతుంది. ఈ ఏడాది చివర్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రం తర్వాత నితిన్ చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో, వెంకీ అట్లూరి దర్శకత్వంలో చిత్రాలకు కమిటై ఉన్నాడు.