చిత్ర పరిశ్రమలో సాధారణంగా ఒక్క ఫ్లాప్ వస్తేనే నెక్స్ట్ సినిమాను అతనితో చేయాలా వద్దా అనే టెక్నీషియన్స్ ఇప్పుడు ఆ విధంగా ఆలోచించడం లేదు. వారికంటి ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న హీరోలకు ఎప్పటికైనా అవకాశాలు ఉంటాయని నితిన్ ను చూస్తుంటేనే అర్ధమవుతోంది. 

మాస్ ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ తెచ్చుకున్న నితిన్ కు ఫ్లాప్స్ కొత్తేమి కాదు. ఎనిమిదేళ్ల పాటు సక్సెస్ అతన్ని ఎంతగా ఊరించిందో అందరికి తెలిసిందే. అయితే ఇష్క్ తరువాత కొంచెం పడుతూ లేస్తూ అఆ సినిమాతో బాక్స్ ఆఫీస్ హిట్ అందుకున్నాడు. ఇక ఆ తరువాత హ్యాట్రిక్ డిజాస్టర్స్ అతనికి మళ్ళి ఆందోళన కలిగించే అంశం. ఇటీవల శ్రీనివాస కళ్యాణం ఫ్యామిలీ ఆడియెన్స్ ని ఆకట్టుకుంటుందని అనుకున్నా కూడా ఆ సినిమా డిజాస్టర్స్ లో ఒకటికి చేరింది. 

అసలు మ్యాటర్ లోకి వస్తే ఈ కుర్ర హీరోతో చేయడానికి సక్సెస్ అందుకున్న దర్శకులు క్యూలో నిలబడుతున్నారు. ముఖ్యంగా ఛలో సినిమాతో బాక్స్ ఆఫీస్ దగ్గర ఊహించని హిట్టందుకున్న వెంకీ కుడుములతో ఒక ప్రాజెక్ట్ ఫిక్సయిన సంగతి తెలిసిందే. ఆ సినిమా షూటింగ్ నవంబర్ రెండవ వారంలో మొదలు కానుంది. 

ఇక డీజేతో విజయాన్ని అందుకున్న హరీష్ శంకర్ కూడా నితిన్ తో ఒక సినిమా చేయాలనీ ఎప్పటినుంచొ అనుకుంటున్నాడు. వారి కాంబోలో త్వరలోనే ఒక సినిమా వచ్చే అవకాశం ఉంది. అదే విధంగా గరుడవేగతో విజయాన్ని చూసిన ప్రవీణ్ సత్తారు కూడా నితిన్ తో ఒక కాన్సెప్ట్ అనుకుంటున్నట్లు తెలుస్తోంది. 

ఇక రీసెంట్ గా ప్రయోగాత్మక చిత్రాలతో నిత్యం ఆకట్టుకునే చంద్రశేఖర్ యేలేటి కూడా నితిన్ ను కలిసి ఒక మంచి కథతో ఒప్పించినట్లు సమాచారం. నితిన్ సినిమాలు ఓ వైపు ఫ్లాప్ అవుతుంటే దర్శకులు మాత్రం తమ స్టైల్ లో నితిన్ ను ప్రజెంట్ చేస్తామని వెళుతున్నారు. మరి నితిన్ ఈ సక్సెస్ ఫుల్ దర్శకుల ద్వారా హిట్ అందుకుంటాడో లేదో చూడాలి.