ఒక ప్లాప్ సినిమాకు పనిచేసిన టీమ్ మళ్ళీ మరో సినిమాతో రెడీ అవ్వడం అంటే అంత ఈజీ కాదు. ఒకవేళ కలిస్తే తప్పకుండా కంటెంట్ సాలిడ్ గా ఉంటుందని ఆడియెన్స్ లో ఒక నమ్మకం ఏర్పడుతుంది. ఇప్పుడు ఛల్ మోహన్ రంగ టీమ్ పై కూడా అలాంటి నమ్మకంను పెంచడానికి ట్రై చేస్తోంది. 

కృష్ణ చైతన్య దర్శకత్వంలో నితిన్ హీరోగా నటించిన ఛల్ మోహన్ రంగ డిజాస్టర్ అయిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ సంయుక్తంగా నిర్మించిన ఆ సినిమా నితిన్ కెరీర్ లో 25వ సినిమా. భారీ అంచనాల నడుమ వచ్చిన ఛల్ మోహన్ రంగ ఊహించని ఫలితాన్ని అందుకోవడంతో నితిన్ కెరీర్ కు ఏడాది పాటు బ్రేకులు పడ్డాయి. 

ఇక ప్రస్తుతం పుంజుకొని వరుసగా మూడు సినిమాలను సెట్స్ పైకి తెచ్చాడు. ఆ సంగతి అటుంచితే ఇప్పుడు మళ్ళీ కృష్ణ చైతన్యతో కొత్త తరహా కథను నితిన్ సెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. కథకు ఫినిషింగ్ టచ్ చేస్తున్న కృష్ణ చైతన్య నితిన్ ని తెరపై సరికొత్తగా ప్రజెంట్ చేయనున్నాడట. అయితే సినిమాను ఎవరు నిర్మిస్తారు అనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. త్వరలో ప్రాజెక్ట్ కి సంబందించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి.