టాలీవుడ్ యువ హీరో నితిన్ గత కొంత కాలం అపజయాలను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ అఆ  తరువాత నితిన్ చేసిన సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద దారుణమైన రిజల్ట్ ని అందుకున్నాయి. లై - ఛల్ మోహన్ రంగ - శ్రీనివాస కళ్యాణం సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద కొంతైనా లాభాలను అందించలేకపోయాయి. 

మంచి కథల కోసం దాదాపు ఏడాది సమయం తీసుకున్న నితిన్ గ్యాప్ టూ గ్యాప్  కథల్ని సెలెక్ట్ చేసుకున్నాడు. మొదట వెంకీ కుడుముల డైరెక్షన్ లో భీష్మ సినిమాను రిలీజ్ చేయనున్న సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమా పనులు చాల స్పీడ్ గా ఎండింగ్ కి వచ్చేశాయి. కొంత షూటింగ్ మిగిలి ఉండగానే నితిన్ డబ్బింగ్ పనులు కూడా మొదలుపెట్టాడు. రీసెంట్ గా నితిన్ తో పాటు మరికొంత మంది కీలక నటీనటులు దాబ్బింగ్ వర్క్ లో జాయిన్ అయినట్లు తెలుస్తోంది. 

ఇక ఈ పని పూర్తయితే వీలైనంత త్వరగా టీజర్ ని రిలీజ్ చేయాలనీ చిత్ర యూనిట్ ప్లాన్ చేసుకుంటోంది. ఛలో సినిమాతో సక్సెస్ అందుకున్న వెంకీ ఈ సినిమాకు  డైరెక్ట్ చేస్తుండడంతో ఓ వర్గం ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. భీష్మ సినిమాను ఫైనల్ గా డిసెంబర్ లో రిలీజ్ చేయాలనీ చిత్ర యూనిట్ ప్లాన్ చేసుకుంటోంది.