గతేడాదితో `భీష్మ`తో సూపర్ హిట్ అందుకున్న నితిన్ ఇప్పుడు ఫుల్ జోష్‌లో ఉన్నారు. బ్యాక్ టూ బ్యాక్ మూడు సినిమాలు చేస్తున్నారు. అందులో ఒకటి `చెక్`. క్రియేటివ్ డైరెక్టర్ చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది. ఈ సినిమా రిలీజ్ డేట్‌ని ఫిక్స్ చేశారు.
గతేడాదితో `భీష్మ`తో సూపర్ హిట్ అందుకున్న నితిన్ ఇప్పుడు ఫుల్ జోష్‌లో ఉన్నారు. బ్యాక్ టూ బ్యాక్ మూడు సినిమాలు చేస్తున్నారు. అందులో ఒకటి `చెక్`. క్రియేటివ్ డైరెక్టర్ చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది. ఈ సినిమా రిలీజ్ డేట్‌ని ఫిక్స్ చేశారు. ఫిబ్రవరి 19న విడుదల చేయనున్నట్టు తాజాగా శుక్రవారం చిత్ర బృందం వెల్లడించింది.
The wait is over! #Check♟️ is coming to you on February 19th. 😎
— nithiin (@actor_nithiin) January 22, 2021
#CheckOnFeb19th@yeletics @Rakulpreet #PriyaPrakashVarrier @kalyanimalik31 @BhavyaCreations @adityamusic pic.twitter.com/uIq4IsGoiZ
ఇక ఇందులో రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కోర్ట్ రూమ్ ప్రధానంగా, యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సినిమా సాగుతుందని అర్థమవుతుంది. ఇందులో ఆదిత్య అనే కుర్రాడి పాత్రలో నితిన్ నటిస్తున్నారు. చెస్ అద్భుతంగా ఆడే ఆదిత్య.. దేశద్రోహిగా ఎందుకు మారాడు, ఎలా మారాడనే కథాంశంతో ఈ సినిమా రూపొందుతుందని అర్థమవుతుంది. ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలను పెంచుతుంది.
ఇందులో నితిన్ ఓ డిఫరెంట్ రోల్‌లో కనిపించబోతున్నట్టు తెలుస్తుంది. మరోవైపు ఈ సినిమాలో రకుల్ లాయర్‌గా నటిస్తుంది. నితిన్‌కి జోడిగా లవ్ ఇంట్రెస్ట్ గా ప్రియా ప్రకాష్ వారియర్ కనిపించబోతునట్టు టాక్.దీంతోపాటు నితిన్ `రంగ్ దే`, `అంధాధున్` రీమేక్‌లో నటిస్తున్నారు.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Jan 22, 2021, 6:57 PM IST