పాలిటిక్స్ లో మార్పు తీసుకురాగల సత్తా పవన్ కళ్యాణ్ కి ఉంది

First Published 29, Mar 2018, 12:43 PM IST
Nithin Opinion on About Pawan kalyan in Politics
Highlights
పాలిటిక్స్ పవన్ మార్చగలడు

 

సమ్మర్ సినీ సంరంభానికి టాలీవుడ్ రెడీ అయిపోయింది. రేపు రామ్ చరణ్ రంగస్థలం రిలీజ్ అవుతుండగా.. వచ్చే వారం విడుదల కానున్న నితిన్ మూవీ రంగస్థంలంపై కూడా మంచి అంచనాలే ఉన్నాయి. మూవీ రిలీజ్ దగ్గరపడుతుండడంతో.. ప్రమోషన్స్ లో యాక్టివ్ అయిపోతున్నాడు నితిన్. 

తండ్రి తర్వాత తాను ఇద్దరు వ్యక్తులను ఎక్కువగా ప్రేమిస్తాననని చెప్పిన నితిన్.. వారిద్దరూ పవన్ కళ్యాణ్ అండ్ త్రివిక్రమ్ అన్నాడు. అలాంటిది ఆ ముగ్గురు కలిసి తనతో ఓ సినిమా చేయడం మరచిపోలేని అనుభూతి అంటున్న నితిన్.. తనకు రాజకీయాల గురించి అంతగా తెలియదని చెప్పుకొచ్చాడు. కానీ పవన్ కళ్యాణ్ ఐడియాలజీ గురించి మాత్రం తెలుసు అని.. పాలిటిక్స్ లో మార్పు తీసుకురాగల సత్తా ఉన్న ఆలోచనలు తన దేవుడు పవన్ దగ్గర ఉన్నాయని అంటున్నాడు నితిన్. అలాం పవర్ స్టార్ తన సినిమాకు నిర్మాతగా వ్యవహరించడాన్ని అసలు నమ్మలేకపోతున్నట్లు చెప్పాడు ఈ యంగ్ హీరో.

ఈ సినిమా కథ గురించి పవన్ వాకబు చేశారని.. త్రివిక్రమ్ కథ అందించారని చెప్పగా వెంటనే తాను ప్రొడ్యూస్ చేస్తానని అన్నాడట పవన్ కళ్యాణ్. నిజానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ కే ఈ చిత్రాన్ని దర్శకత్వం వహించాలని ఉన్నా.. ప్రస్తుత షెడ్యూల్ కారణంగా ఆ పని చేయలేనని.. అందుకే కృష్ణ చైతన్యతో తీద్దామని అన్నాడట మాటల మాంత్రికుడు. 

loader