"శ్రీనివాస కళ్యాణం" లాస్ట్ ఇయిర్  ఆగస్టులో రిలీజ్‌ అయింది. ఈ సినిమా డిజాస్టర్ ఫలితం తర్వాత నితిన్ మరో సినిమా మెదులుపెట్టడానికి చాలా టైమ్ పట్టింది. "ఛలో" దర్శకుడు వెంకీ కుడుముల కథని ఓకే చేసి  నెలలు దాటుతోన్నా ఇంకా మొదలుపెట్టలేదు.  మరో సినిమా ఫ్లాప్ అయితే తన కెరీర్ తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉందని నితిన్ ఆచి తూచి అడుగులు వెయ్యాలని స్పీడు తగ్గించేసాడు.

కానీ కథలు వింటూనే ఉన్నాడు. తాజాగా డాలీ (కిషోర్ పార్ధసాని) దర్శకత్వంలో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. సిద్దార్ద, తమన్నా కాంబినేషన్ లో వచ్చిన కొంచెం ఇష్టం కొంచెం కష్టం సినిమాతో పరిచయమయిన డాలీ  ఆ తర్వాత పవన్ తో రెండు సినిమాలు డైరక్ట్ చేసారు.

బాలీవుడ్ సూపర్ హిట్ రీమేక్ ఓ మై గాడ్ ..గోపాల గోపాల తో యావరేజ్ అనిపించుకున్నారు. ఆ తర్వాత తమిళ సూపర్ హిట్ వీరమ్ రీమేక్ ని కాటమరాయుడు గా రీమేక్ చేసి డిజాస్టర్ చేసాడు. ఇప్పుడు ఆయన నితిన్ తో సినిమా చేయబోతున్నారని సమాచారం. పవన్ కు వీరాభిమాని అయిన నితిన్ ని రీసెంట్ గా కలిసిన డాలీ ఓ కథ చెప్పాడని తెలుస్తోంది.

ఈ విషయంలో పవన్ రికమెండ్ చేసాడని, అందుకే వెంటనే నితిన్ ఓకే చేసాడని చెప్పుకుంటున్నారు. అయితే కథ చాలా బాగుందని, ఈ సారి డాలి మంచి హిట్ కొడతాడని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే సినిమా మాత్రం ఈ సంవత్సరం ఆఖరుకి కానీ ప్రారంభం కాదని చెప్తున్నారు. నితిన్ ప్రస్తుతం ఉన్న ప్రాజెక్టు ఫినిష్ చేసుకుని ఈ సినిమా చేస్తారట.