ఇటీవల కాలంలో స్టార్ దర్శకులు ఒక సినిమా చేయడానికి సమయం చాలా తీసుకుంటున్నారు. అయితే వారిపై అభిమానులు పెంచుకున్న అంచనాలకు కొన్ని చిన్న తరహా కథలను డైరెక్ట్ చేయలేకపోతున్నారు. అందుకే కొన్ని కథలు రాసుకొని వారి శిష్యుల ద్వారా జనాల్లోకి పంపుతున్నారు. 

ఆ తరహాలో సుకుమార్ ఆల్ రెడీ సక్సెస్ అందుకున్నారు. కుమారి 21F సినిమా ఏ స్థాయిలో విజయాన్ని అందుకుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. సూర్య ప్రతాప్ దర్శకత్వం వహించినా ఆ సినిమాకు సుకుమార్ కథ స్క్రీన్ ప్లే అందించారు. ఇక రీసెంట్ గా మరొక కథను తన స్టూడెంట్ కి అప్పగించాడు సుకుమార్. 

గీత ఆర్ట్స్ లో నిర్మించనున్న ఆ సినిమాలో నితిన్ హీరోగా సలెక్ట్ అయ్యాడు. ఇటీవల కథ చర్చలను జరిపి నితిన్ తో డేట్స్ సెట్ చేసుకున్నట్లు తెలిస్తోంది. త్వరలోనే ఆ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసి విడుదల చేయాలనీ సుకుమార్ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.