నితిన్ హీరోగా విలక్షణ దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి తెరకెక్కించిన చిత్రం చెక్. చెస్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు రిలీజ్ కు ముందు మంచి ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయి. అయితే మార్నింగ్ షోకే  నెగిటివ్ టాక్ వచ్చింది.   ఆ టాక్ ఎఫెక్ట్ ...కలెక్షన్స్‌పై కూడా ప్రభావం పడింది. ఫస్ట్ డే కేవలం 3.5 కోట్ల షేర్ మాత్రమే వసూలు చేసిన చెక్.. ఆ తర్వాత మెల్లిమెల్లిగా డ్రాప్ అవుతూ పోయింది. వరల్డ్ వైడ్‌గా ఫస్ట్ వీకెండ్ టోటల్ కూడా 7.27 కోట్లు షేర్ మాత్రమే వచ్చినప్పుడే ఈ సినిమాపై ఆశలు అంతరించిపోయాయి. దాంతో నితిన్‌కు మరో భారీ ఫెయిల్యూర్‌గా చెక్ నిలవబోతోందని అర్దమైపోయింది. దాదాపు 17 కోట్ల బిజినెస్ చేసిన ఈ చిత్రం క్లోజింగ్ కలెక్షన్స్ పరిస్దితి ఏమిటి...ఎంత కలెక్ట్ చేసిందో చూద్దాం.  


చెక్ ఫుల్ రన్ వసూళ్లు:
ఏరియా     షేర్ 
నైజాం     3.28cr
సీడెడ్     0.98cr
ఉత్తరాంధ్ర     1.18cr
గుంటూరు     0.94cr
క్రిష్ణ     0.56cr
ఈస్ట్ గోదావరి     0.47cr
వెస్ట్ గోదావరి     0.55cr
నెల్లూరు     0.29cr
ఆంధ్ర+తెలంగాణా     8.25cr
రెస్ట్ అఫ్ ఇండియా    0.35cr
ఓవర్సీస్     0.72cr
ప్రపంచవ్యాప్తంగా    9.33cr


 మొత్తంగా పదిహేడు కోట్ల వరకు బిజినెస్ చేసిన ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాల్సిన మొత్తం కూడా రాబట్టలేకపోయింది.  మొత్తంగా చెక్ మూవీ నితిన్ కెరీర్‌లో మరో డిజాస్టర్ మూవీగా నిలిచిపోయింది. నితిన్ ఈ సినిమాని పట్టించుకోవటం మానేసి ..ఈ నెల 26న రాబోతున్న రంగ్ దే మీద  ఇప్పటికే స్పెషల్ ఫోకస్ పెట్టేశాడు. చెక్ తాలూకు ప్రభావం దాని మీద పడుతుందా లేదా అనేది చూడాలి. అయితే కీర్తి సురేష్, దేవి శ్రీ ప్రసాద్ సంగీతం, వెంకీ అట్లూరి టేకింగ్ ఇవన్నీ యూత్ లో ప్రత్యేకంగా అంచనాలు పెంచుతున్నాయి. దీంతో మళ్ళీ హిట్ కొడితే చెక్ తాలూకు చేదు అనుభవాల నుంచి త్వరగా బయట పడవచ్చు.