నితిన్, కీర్తిసురేష్‌ నటించిన `రంగ్‌దే` చిత్ర ట్రైలర్‌ శుక్రవారం విడుదలైంది. కర్నూల్‌లో ఓ ఈవెంట్‌గా ఈ ట్రైలర్‌ లాంచ్‌ కార్యక్రమం జరిగింది. విడుదలైన ట్రైలర్‌ ఆద్యంతం కట్టిపడేస్తుంది. ఫన్‌, లవ్‌, ఎమోషన్స్‌ ప్రధానంగా సినిమా సాగబోతుందని తాజాగా ట్రైలర్‌ని చూస్తే అర్థమవుతుంది. 

నితిన్‌, కీర్తిసురేష్‌ జంటగా నటిస్తున్న చిత్రం `రంగ్‌దే`. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ నెల 26న సినిమా విడుదల కానుంది. ఈ సందర్బంగా శుక్రవారం చిత్ర ట్రైలర్‌ని విడుదల చేశారు. కర్నూల్‌లో ఓ ఈవెంట్‌గా ఈ ట్రైలర్‌ లాంచ్‌ కార్యక్రమం జరిగింది. విడుదలైన ట్రైలర్‌ ఆద్యంతం కట్టిపడేస్తుంది. ఫన్‌, లవ్‌, ఎమోషన్స్‌ ప్రధానంగా సినిమా సాగబోతుందని తాజాగా ట్రైలర్‌ని చూస్తే అర్థమవుతుంది. 

నితిన్‌ చిన్నప్పుడే తనకొక గర్ల్ ఫ్రెండ్‌ని ప్రసాదించమని కోరుకోగా, అంతలోనే ఓ పాట తమ కాలనీకి వచ్చింది. అప్పటి నుంచే నితిన్‌ని తొక్కేయడం ప్రారంభిస్తుంది. నితిన్‌ని పట్టుకుని `వీడిని చదివించే ఓపిక ఈ మిడిల్‌ క్లాస్‌ తండ్రికి లేదు` అని నరేష్‌ చెప్పడంతో, అప్పర్‌ మిడిల్‌ క్లాస్‌ అని చెప్పావ్‌ కదా అమ్మా అని నితిన్‌ అడుగుతాడు. దీని వల్ల తమ ఫ్యామిలీలో నితిన్‌ పెద్ద ఎదవ అయిపోయాడట. పెంటమీద రాయి వేస్తే మన బట్టలే పాడవుతాయని నితిన్‌ చెబుతుంటే, పర్వాలేదు ఇంటికెళ్లి సర్ఫ్‌ పెట్టి ఉతుక్కుంటానని కీర్తిసురేష్‌ చెబుతుంది. 

ఇంతలో నితిన్‌, కీర్తిసురేష్‌ మధ్య పెళ్లికి ముందే ఇద్దరు రొమాన్స్ లో మునిగిపోయారు. దీంతో ఇరు కుటుంబాల్లో పెద్ద గొడవ. నితిన్‌కి ఇష్టం లేదు. కానీ కీర్తిసురేష్‌కి మాత్రం నితిన్‌ని పెళ్లి చేసుకోవాలని ఉబలాటపడుతుంది. ఆ తర్వాత కీర్తికి కన్సీవ్‌ అవుతుంది. `కంగ్రాట్స్ నువ్వు మొగాడివిరా బుజ్జి` అని చెపుబుతుంది కీర్తి. ఆ తర్వాత ఇద్దరి మధ్య గొడవలు ప్రారంభమవుతాయి. ఈ క్రమంలో `మనల్నిప్రేమించే వారి విలువ మనం వారిని వద్దనుకున్నప్పుడు కాదు, మనల్ని వారు అక్కర్లేదనుకున్నప్పుడు తెలుస్తుంది` అని నితిన్‌ చెప్పడం, అనంతరం నెక్ట్స్ గొడవ కలవడానికి చెయ్‌, గెలవడానికి కాదు` అని కీర్తి వాళ్ల అమ్మ చెప్పడం హైలైట్‌గా నిలుస్తుంది. మొత్తంగా ట్రైలర్‌ ఆద్యంతం ఆకట్టుకుంటుంది.