వరసగా ఎనిమిది సంవత్సరాల పాటు ఫెయిల్యూర్స్ ని ఎదుర్కొని మళ్లీ హిట్ ట్రాక్ లో వచ్చిన వాడు నితిన్. అయితే ఫెయిల్యూర్స్ ఉన్నప్పుడు ఎప్పుడూ తన ప్రక్కన టాప్ హీరోయిన్స్ నే ఎంచుకునే వాడు. త్రిష, ప్రియమణి, హన్సిక, జెనీలియా, ఇలియానా వంటివారు ఆ టైమ్ లో ఆయన ప్రక్కన చేసినవారే. అయితే అప్పుడు ఒక్క హిట్టూ ఆయన్ని పలకరించలేదు. 

ఆ తర్వాత అప్పటికి కొత్త అయిన నిత్యామీనన్ తో చేసిన ఇష్క్, గుండె జారి గల్లంతయ్యిందే సినిమాలు మాత్రం హిట్ తెచ్చి పెట్టాయి.  అయితే వెంటనే అ..ఆ సినిమాతో సమంతతో సినిమా చేసారు. అది నితిన్ కెరీర్ లోనే పెద్ద హిట్ ని నమోదు చేసింది. ఆ వెంటనే మళ్లీ శ్రీనివాస కళ్యాణం, లై, ఛల్ మోహన్ రంగ అంటూ భాక్సాఫీస్ డిజాస్టర్స్  ఇచ్చారు. 

ఇప్పుడు ఏడాది గ్యాప్ తీసుకుని భీష్మ సినిమా ఓకే చేసారు. అయితే ఈ సారి మళ్లీ టాప్ హీరోయిన్స్ వెనకే పడుతున్నారు. రష్మిక మందన్న ని తన సినిమాలో ఖచ్చితంగా ఉండాల్సిందే అని పట్టుబడుతున్నారు. అయితే ఆమె డేట్స్ చాలా కష్టమని టీమ్ చెప్తూంటే...అప్పటిదాకా తన షూట్ ని ఆపుచేద్దామని చెప్పారట. అలాగే వెంకీ అట్లూరి తో చేయబోయే సినిమాకోసం కూడా కీర్తి సురేష్ డేట్స్ దొరికాకే సినిమా ప్రారంభిద్దామని నితిన్ చెప్పారట. అలా నితిన్ మళ్లీ టాప్ హీరోయన్స్ వెనకే పడుతున్నారు.