‘చెక్’ మూవీ 3 రోజుల కలెక్షన్స్
దాదాపు ఏడాది గ్యాప్ తర్వాత మొన్న శుక్రవారం రోజు (ఫిబ్రవరి 26) చెక్ ప్రేక్షకులు ముందుకు వచ్చింది. `చెక్`పై చాలా అంచనాలు ఏర్పడ్డాయి. చంద్ర శేఖర్ యేలేటి దర్శకత్వంలో రూపొందిన సినిమా కావడం, పోస్టర్స్, ట్రైలర్స్ ఆకట్టుకోవడంతో ఈ సినిమాపై ఫోకస్ ఏర్పడింది. అయితే.. `చెక్` అన్ని విధాలా నిరాశ పరిచింది. వైవిధ్యమైన ఇతివృత్తంతో వచ్చిన ‘చెక్’పై నితిన్ కూడా ఎన్నో అంచనాలు పెట్టుకున్నాడు. రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా వచ్చిన ‘చెక్’ కు మార్నింగ్ షోకే డివైడ్ టాక్ వచ్చింది.

అలాగే ఈ సినిమా దాదాపుగా 17 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుంది. భీష్మకి వచ్చిన ఫస్ట్ డే కలక్షన్లతో పోలిస్తే చాలా తక్కువ. అలాగే శని, ఆది వారాలు సైతం చెక్ వసూళ్లు నిరాశ పరిచాయి. మూడు రోజులకు కలిపి 6 కోట్ల వరకూ రాబట్టిందని తెలుస్తోంది. అంటే.. మరో 11 కోట్లు రావాలన్నమాట. ఈ నేపధ్యంలో వీకెండ్ (మూడు రోజుల) కలెక్షన్స్ చూద్దాం.
చెక్ మూడు రోజుల కలక్షన్లు
నైజాం 2.4 కోట్లు
సీడెడ్ 80 లక్షలు
ఉత్తరాంధ్ర 90 లక్షలు
గుంటూరు 82 లక్షలు
ఈస్ట్ 32 లక్షలు
వెస్ట్ 50 లక్షలు
కృష్ణ 43 లక్షలు
నెల్లూరు 25 లక్షలు
రెస్టాఫ్ ఇండియా 40 లక్షలు
ఓవర్సీస్ 45 లక్షలు
వరల్డ్ వైడ్ 3 రోజుల షేర్ - 07.66 కోట్లు
వరల్డ్ వైడ్ 3 రోజుల గ్రాస్ - 14.00 కోట్లు
ఏదో అద్భుతం జరిగితే తప్ప... చెక్ బయ్యర్లు నష్టాల నుంచి బయటపడే ఛాన్స్ లేదు. ఈ సినిమా ప్రభావం నితిన్ నుంచి రాబోయే `రంగ్ దే`పై పడే ప్రమాదం ఉంది.