2002లో దిల్ సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన నితిన్ ఇప్పటివరకు ఏ ఏడాది కూడా వెండితెరను మిస్ అవ్వలేదు. 17 ఏళ్ల సినీ కెరీర్ లో జయాపజయాలతో సంబంధం లేకుండా ఎదో ఒక సినిమాతో బిజీగా కనిపిస్తూ వస్తున్నాడు. అయితే కెరీర్ లో ఏప్పుడు లేని విధంగా నితిన్ ఈ మధ్య కెమెరాకు లాంగ్ గ్యాప్ ఇచ్చాడు.  

శ్రీనివాస కళ్యాణం తరువాత దాదాపు 10 నెలలు ఎలాంటి షూటింగ్స్ లో పాల్గొనకుండా ఉన్నాడు. 'అఆ' సినిమా అనంతరం వరుస అపజయాలు ఎదురవ్వడంతో కథల ఎంపిక విషయంలో నితిన్ తడబడ్డాడు. అందుకే కాస్త స్పీడ్ తగ్గించాడు. నెక్స్ట్ భీష్మా సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ బుధవారం మొదలు కానుంది. లాంగ్ గ్యాప్ తరువాత నితిన్ మేకప్ వేసుకోబోతున్నాడు. 

భీష్మా ఇంకా ఆలస్యమయ్యే అవకాశం ఉందని అందువల్ల ఈ ఏడాది నితిన్ సినిమా లేనట్లే అని వస్తోన్న వార్తలకు ఎండ్ కార్డ్ పెట్టేసి వీలైనంత త్వరగా సినిమాను పూర్తి చేయాలనీ చూస్తున్నాడు. ఈ ఏడాది చివర్లో సినిమా విడుదలయ్యే విధంగా నితిన్ ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఛలో దర్శకుడు వెంకీ కుడుముల ఈ సినిమాను డైరెక్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే.