భీష్మ సినిమాతో కెరీర్ బెస్ట్ హిట్ అందుకున్న యంగ్ హీరో నితిన్ మంచి జోష్ లో ఉన్నాడు. తన  హిట్ ట్రాక్ ని కంటిన్యూ చేస్తూ నితిన్ అనౌన్స్ చేసిన కొత్త సినిమా అంధాదున్ రీమేక్. నితిన్ హీరోగా మేర్ల‌పాక గాంధీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న చిత్రం షూటింగ్  మొద‌లైంది. హీరో హీరోయిన్లు నితిన్‌, న‌భా న‌టేష్‌పై దుబాయ్‌లో స‌ీన్స్ షూట్ చేస్తున్నారు. షూటింగ్ మొద‌లైన విష‌యాన్ని త‌న ట్విట్ట‌ర్ హ్యాండిల్ ద్వారా తెలియ‌జేసిన నితిన్‌, సెట్స్ మీద నుంచి ఓ ఫొటోను సైతం షేర్ చేశారు. ఫొటోలో ఆయ‌న‌ ష‌ర్టుపై స్వెట‌ర్ వేసుకొని పియానో ప్లే చేస్తూ క‌నిపిస్తున్నారు.

ఈ  మూవీలో త‌మ‌న్నా భాటియా ఓ కీల‌క పాత్ర చేస్తున్నారు. జ‌న‌వ‌రి నుంచి జ‌రిగే త‌దుప‌రి షెడ్యూల్ షూటింగ్‌లో ఆమె పాల్గొన‌నున్నారు. శ్రేష్ఠ్ మూవీస్ బ్యాన‌ర్‌పై త‌యార‌వుతున్న ఈ ప్రొడ‌క్ష‌న్ నంబ‌ర్ 6ను ఎన్‌. సుధాక‌ర్ రెడ్డి, నికితా రెడ్డి నిర్మిస్తున్నారు. మ‌హ‌తి స్వ‌ర‌సాగ‌ర్ సంగీతం స‌మ‌కూరుస్తున్న ఈ చిత్రానికి హ‌రి కె. వేదాంత్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. త్వ‌ర‌లోనే ఈ చిత్రానికి ప‌నిచేస్తున్న మిగ‌తా తారాగ‌ణం, టెక్నీషియ‌న్ల వివ‌రాల‌ను వెల్ల‌డించ‌నున్నారు. 

 ఆయుష్మాన్ ఖురానా టబు రాధికా ఆప్టే కలిసి నటించిన ఈ హింది మూవీ ప్రేక్షకులని మాత్రమే కాకుండా క్రిటిక్స్ ని కూడా మెప్పించింది. న్యూ ఏజ్ సినిమాగా పేరు తెచ్చుకున్న అంధాదున్ సినిమా రైట్స్ ని నితిన్ కొని చాలా రోజులే అయ్యింది కానీ ఎలాంటి అప్డేట్ బయటకి రాలేదు. ఇప్పుడు మ్యాసివ్ అనౌన్స్మెంట్ తో నితిన్ అభిమానులని ఖుషి చేసింది.

ఈ రీమేక్ లో టబు పాత్రలో తమన్నా, రాధికా ఆప్టే పాత్రలో నభ నటేష్ ని ఫైనల్ చేసినట్లు చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది. ఈ సందర్భంగా సినిమా గురించి మరిన్ని వివరాలు కూడా చెప్తూ, మ్యూజిక్ స్వరభాస్కర్, హరి వేదాంత్ కెమెరా వర్క్ చేస్తున్నట్లు చెప్పారు.డైలాగ్స్‌-డైరెక్ష‌న్‌: మేర్ల‌పాక గాంధీ, నిర్మాత‌లు: ఎన్‌. సుధాక‌ర్ రెడ్డి, నికితా రెడ్డి, బ్యాన‌ర్‌: శ్రేష్ఠ్ మూవీస్‌, నిమాకి సంబంధించిన ఇతర కాస్ట్ అండ్ క్రూ డిటైల్స్ త్వరలోనే అనౌన్స్ చేయనున్నారు.